గుడివాడలో టెన్షన్‌ టెన్షన్‌.. మాజీ ఎమ్మెల్యే రావిని చంపేస్తామంటూ వైసీపీ నేత కాళీ బెదిరింపులు

ABN , First Publish Date - 2022-12-25T21:26:19+05:30 IST

గుడివాడ (Gudivada)లో తీవ్ర ఉద్రికత్త చోటు చేసుకుంది. ప్రెటోలు సంచులతో గడ్డం గ్యాంగ్‌ వీరంగం చేసి పట్టణంలో భయానక వాతావరణాన్ని సృషించారు.

గుడివాడలో టెన్షన్‌ టెన్షన్‌.. మాజీ ఎమ్మెల్యే రావిని చంపేస్తామంటూ వైసీపీ నేత కాళీ బెదిరింపులు

గుడివాడ: గుడివాడ (Gudivada)లో తీవ్ర ఉద్రికత్త చోటు చేసుకుంది. ప్రెటోలు సంచులతో గడ్డం గ్యాంగ్‌ వీరంగం చేసి పట్టణంలో భయానక వాతావరణాన్ని సృషించారు. విషయం తెలిసి కూడా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. వైసీపీ (YCP) శ్రేణులను నిలవరించలేక మిన్నకుండిపోయిన పోలీసులు, తిరిగి టీడీపీ శ్రేణులపై లాఠీచార్జ్‌కు దిగడం వివాదాస్పదమైంది. వీడియో చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపైనా కూడా గడ్డం గ్యాంగ్‌ దాడికి తెగపడి సెల్‌ఫోన్‌లు, కెమెరాలను పగలకొట్టారు.

ఆదివారం ఒక ప్రైవేట్‌ కార్యక్రమంలో ఉన్న టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఫోన్‌కు గడ్డం గ్యాంగ్‌ నేత, మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు మెరుగుమాల కాళీ ఫోన్‌ చేసి అసభ్యపదజాలంతో దూషిస్తూ చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో రావి హుటాహుటిన కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. వెనువెంటనే కాళీ తన అనుచరులతో టీడీపీ కార్యాలయం (TDP office) వద్ద చేరుకుని పోలీసులు ఎదుటే టీడీపీ కార్యాలయంపై దాడికి తెగబడ్డారు. ముందుగానే సిద్ధం చేసుకున్న పెట్రోలు సంచులను టీడీపీ శ్రేణులపైకి విసిరారు. ఏకంగా కానిస్టేబుల్‌పై దాడి చేసినా పోలీసులు మిన్నకుండిపోయారు.

విషయం తెలిసి కార్యాలయానికి చేరుకున్న తెలుగు తమ్ముళ్ళు ధీటుగా వైసీపీ శ్రేణులకు జవాబు యిచ్చారు. దాడికి తెగబడిన వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. టీడీపీ శ్రేణులను చెదరగొట్టారు. ఈ క్రమంలో ద్విచక్రవాహనదారుడుపై కూడా లాఠీచార్జ్‌ చేయడంతో అతను వాహనంతో సహా కిందపడి గాయాలపాలయ్యాడు. ప్రధాన రహదారికి ఇరువైపులా ఇరువర్గాలు భారీగా మోహరించాయి. భారీగా చేరుకున్న పోలీసులు పరిస్ధితిని అదుపులోకి తీపసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 26వ తేదీన రంగా వర్ధంతి కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనకుండా పట్టణంలో భయానక వాతావరణాన్ని సృష్టించేందుకే గడ్డం గ్యాంగ్‌ ఈ దుశ్చర్యకు పాల్పడిందని సమాచారం.

Updated Date - 2022-12-25T21:26:20+05:30 IST