Rains: రానున్న 24 గంటల్లో ఏపీలో వర్షాలు

ABN , First Publish Date - 2022-12-02T21:02:14+05:30 IST

సముద్రం మీదుగా కోస్తాపైకి తేమతో కూడిన తూర్పుగాలులు వీస్తున్నాయి. దీంతో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు (Rains) కురిశాయి.

Rains: రానున్న 24 గంటల్లో ఏపీలో వర్షాలు

విశాఖపట్నం: సముద్రం మీదుగా కోస్తాపైకి తేమతో కూడిన తూర్పుగాలులు వీస్తున్నాయి. దీంతో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు (Rains) కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా తూర్పుగాలుల ప్రభావంతో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మేఘాలు ఆవరించడంతో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఆరోగ్యవరంలో 19.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

కాగా ఈ నెల నాలుగో తేదీ నాటికి ఉపరితల ఆవర్తనం దక్షిణ అండమాన్‌లో ప్రవేశించనున్నది. దీని ప్రభావంతో ఐదో తేదీన దక్షిణ అండమాన్‌ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి ఈ నెల ఏడో తేదీ ఉదయంకల్లా ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనున్నది. ఎనిమిదో తేదీన ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరం దిశగా రానున్నది. దీని ప్రభావంతో ఈనెల ఏడో తేదీ రాత్రి నుంచి దక్షిణ కోస్తాలో వర్షాలు ప్రారంభమై ఎనిమిది, తొమ్మిది తేదీల్లో పెరుగుతాయి. ఎనిమిది, తొమ్మిది తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ వాతావరణ నిపుణులు తెలిపారు.

Updated Date - 2022-12-02T21:02:34+05:30 IST