మే ఆఖర్లో ఆకాశ ఎయిర్ సేవలు ప్రారంభం
ABN , First Publish Date - 2022-01-26T06:55:06+05:30 IST
: ప్రముఖ ఈక్విటీ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా పెట్టుబడులు కలిగిన విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ సేవలు ఈ వేసవి కాలం చివర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది...

న్యూఢిల్లీ: ప్రముఖ ఈక్విటీ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా పెట్టుబడులు కలిగిన విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ సేవలు ఈ వేసవి కాలం చివర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ‘‘ఈ ఏడాది ఏప్రిల్ ద్వితీయార్ధానికల్లా బోయింగ్ నుంచి మాకు తొలి విమానం అందుతుందని ఆశిస్తున్నాం. మే నెలాఖరు లేదా జూన్ తొలినాళ్లలో విమాన సర్వీసులను ప్రారంభించాలనుకుంటున్నాం. ఇందుకోసం ప్రభుత్వం, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సంప్రదింపులు జరుపుతున్నాం’’అని ఆకాశ ఎయిర్ సీఈఓ వినయ్ దూబే తెలిపారు. ఈ ఎయిర్‌లైన్స్ మొత్తం 72 ‘బోయింగ్ 737 మ్యాక్స్’ విమానాలను ఆర్డర్ చేసింది. 2023 మార్చి నాటికి 18 విమానాలతో సేవలందించాలనుకుంటోంది.