నీట్ యూజీలో ఆకాష్ విద్యార్థుల అసాధారణ ప్రతిభ.. 67వ ర్యాంక్‌తో మెరిసిన యశ్ సేథీ
ABN , First Publish Date - 2022-09-10T23:10:59+05:30 IST
ఆకాష్ బైజూస్ విద్యార్థులు ఏడుగురు ఇనిస్టిట్యూట్‌కు గర్వకారణంగా నిలిచారు. ప్రతిష్టాత్మకమైన జాతీయ ప్రవేశ పరీక్ష
హైదరాబాద్: ఆకాష్ బైజూస్ విద్యార్థులు ఏడుగురు ఇనిస్టిట్యూట్‌కు గర్వకారణంగా నిలిచారు. ప్రతిష్టాత్మకమైన జాతీయ ప్రవేశ పరీక్ష (నీట్) యూజీ 2022 లో ఆల్ ఇండియా ర్యాంక్‌లు సాధించారు. యశ్ సేథీ (67), రుమైసా జైనాబ్ ఖాన్ (158), త్రిశాల అర్రాబెల్లీ (265), అక్షత్ కొల్ల (318), భరత్ గోయల్ (324), యరమడ మనోప్రీత్ రెడ్డి (336), జిల్ పటేల్ (466) ర్యాంకులు సాధించారు. నీట్‌లో ర్యాంకు సాధించేందుకు ఆకాష్ బైజూస్‌లో రెండు సంవత్సరాల క్లాస్‌రూమ్, లైవ్ ప్రోగ్రామ్‌లో వీరు చేరారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులు మాట్లాడుతూ.. ఆకాష్ ఇనిస్టిట్యూట్ తమకు రెండు అంశాలలోనూ ఎంతగానో తోడ్పడిందన్నారు. కోచింగ్, కంటెంట్ కారణంగానే అతి తక్కువ సమయంలోనే విభిన్నమైన బోధనాంశాలను మెరుగ్గా ఆకళింపు చేసుకోవడం సాధ్యమైందన్నారు.
నీట్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆకాష్ బైజూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాష్ చౌదరి మాట్లాడుతూ.. అసాధారణ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందిస్తున్నట్టు చెప్పారు. నీట్ పరీక్షకు దేశవ్యాప్తంగా 16 లక్షల మందికిపైగా హాజరయ్యారన్నారు. తమ విద్యార్థుల భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. మహమ్మారి కాలంలో ఆకాష్ బైజూస్ ఓ అడుగు ముందుకేసి విద్యార్థులు నీట్ లో మంచి పర్సంటైల్ స్కోర్స్ సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. తమ కష్టం ఫలించినందుకు సంతోషంగా ఉందన్నారు.