10 lakhs: గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందకు రూ. 10 లక్షల నజరానా

ABN , First Publish Date - 2022-12-08T10:38:50+05:30 IST

వేలమ్మాళ్‌ విద్యా సంస్థల ఆధ్వర్యంలో అర్జున అవార్డు గ్రహీత, గ్రాండ్‌ మాస్టర్‌ ఆర్‌.ప్రజ్ఞానంద(Master R. Pragnananda) అభినందన కార్యక్రమం

10 lakhs: గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందకు రూ. 10 లక్షల నజరానా

పెరంబూర్‌(చెన్నై), డిసెంబరు 7: వేలమ్మాళ్‌ విద్యా సంస్థల ఆధ్వర్యంలో అర్జున అవార్డు గ్రహీత, గ్రాండ్‌ మాస్టర్‌ ఆర్‌.ప్రజ్ఞానంద(Master R. Pragnananda) అభినందన కార్యక్రమం జరిగింది. మొగప్పెర్‌లోని వేలమ్మాళ్‌ మెయిన్‌ స్కూల్లో బుధవారం ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖ మంత్రి మెయ్యనాధన్‌, దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబులు పాల్గొని, ప్రజ్ఞానందను సత్కరించి, వేలమ్మాళ్‌ విద్యా సంస్థల తరఫున రూ.10 లక్షల బహుమతి అందజేశారు. రాష్ట్ర క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ పోటీలకు సిద్ధం చేసేలా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) ప్రోత్సహిస్తున్నారని ఈ సందర్భంగా మంత్రులు తెలిపారు. ప్రపంచ ఖ్యాతి గడించిన ప్రజ్ఞానంద తమ పాఠశాల విద్యార్థి కావడం వేలమ్మాళ్‌ విద్యాసంస్థలకు గర్వంగా ఉందని నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-12-08T10:38:51+05:30 IST