Crocodile: జనావాసాల్లో మొసలి సంచారం
ABN , First Publish Date - 2022-10-28T10:35:27+05:30 IST
స్థానిక నెర్‌కుండ్రం గ్రామంలోకి ప్రవేశించిన మొసలిని(Crocodile) యువకులు బంధించారు. పెరుంగళత్తూర్ సమీపంలోని

పెరంబూర్(చెన్నై), అక్టోబరు 27: స్థానిక నెర్‌కుండ్రం గ్రామంలోకి ప్రవేశించిన మొసలిని(Crocodile) యువకులు బంధించారు. పెరుంగళత్తూర్ సమీపంలోని నెర్‌కుండ్రం జలాశయంలోని మొసళ్లు తరచూ సమీపంలోని జనావాస ప్రాంతాల్లోకి వస్తుంటాయి. ఈ నేపథ్యంలో, బుధవారం నెర్‌కుండ్రం మేట్టు వీధిలోకి సుమారు ఏడడుగుల పొడవైన మొసలి ప్రవేశించింది. దానిని చూసిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. కొందరు యువకులు తాళ్లలో మొసలిని బంధించి అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. గిండి అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకొని మొసలిని తీసుకెళ్లారు. జలాశయంలోని మొసళ్లు గ్రామాల్లో ప్రవేశించకుండా అధికారులు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.