Aircraft Crash: కుప్పకూలిన ఐఏఎఫ్ జాగ్వార్ విమానం
ABN , Publish Date - Mar 07 , 2025 | 06:01 PM
శిక్షణా కార్యక్రమంలో భాగంగా అంబాలా ఎయిర్‌బేస్ నుంచి బయలుదేరిన విమానం కొద్ది సేపటికే కుప్పకూలింది. అయితే పైలెట్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై శాఖాపరమైన దర్యాప్తు జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు.

పంచకుల: భారత వైమానిక దళానికి చెందిన జాగ్వార్ యుద్ధ విమానం (Jagual Fighter Aircraft) హర్యానాలోని పంచకులలో కుప్పకూలిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. శిక్షణా కార్యక్రమంలో భాగంగా అంబాలా ఎయిర్‌బేస్ నుంచి బయలుదేరిన విమానం కొద్ది సేపటికే కుప్పకూలింది. అయితే పైలెట్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై శాఖాపరమైన దర్యాప్తు జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు.
IFS Officer Suicide: భవనంపై నుంచి దూకి ఐఎఫ్ఎస్ అధికారి సూసైడ్
''సాంకేతిక లోపం కారణంగా ఈ దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. విమానాన్ని నివాస ప్రాంతాలకు దూరంగా నడిపి పైలట్ సురక్షితంగా దూకేశాడు" అని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సామాజిక మాధ్యమం "ఎక్స్''లో తెలియజేసింది. ప్రమాదానికి దారితీసిన పూర్తి కారణాలపై శాఖా పరమైన విచారణ జరుపనున్నట్టు పేర్కొంది.
పంచకుల జిల్లాలోని పర్వత ప్రాంతంలో విమానం కుప్పకూలినట్టు రాయ్‌పురానీ ఎస్‌హెచ్ఓ మీడియాకు ఫోనులో తెలిపారు. కాగా, గత నెలలో ట్విన్ సీటర్ మిరేజ్ 2000 ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ శిక్షణా కార్యక్రమంలో ఉండగా మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురి సమీపంలో కుప్పకూలింది. విమానం నేలను తాకకముందే ఇద్దరు పైలట్లు బయటకు దూసేకి ప్రాణాలతో బయటపడ్డారు.
ఇవి కూడా చదవండి
Supreme Court: ధారావి పునరాభివృద్ధి ప్రాజెక్టు నిలిపివేతకు సుప్రీంకోర్టు 'నో'
Bihar Assembly Polls 2025: నిన్న, నేడు, రేపు కూడా ఆయనే సీఎం
Ranya Rao questioned by Police: నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసు.. విచారణలో బయటపడ్డ కీలక విషయాలు
భారత్‌కు అప్పగించొద్దు.. చిత్రవధ చేస్తారు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.