MP Raja: ఎంపీ రాజాకు సీబీఐ కోర్టు సమన్లు
ABN , First Publish Date - 2022-11-30T09:23:00+05:30 IST
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారంటూ డీఎంకే ఎంపీ రాజా(DMK MP Raja) సహా నలుగురు జనవరి 10న నేరుగా హాజరుకావాలని సీబీఐ ప్రత్యేక న్యాయ

వేళచ్చేరి(చెన్నై), నవంబరు 29: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారంటూ డీఎంకే ఎంపీ రాజా(DMK MP Raja) సహా నలుగురు జనవరి 10న నేరుగా హాజరుకావాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీచేసింది. ఈ వ్యవహారంలో రాజాపై గత వారం ఛార్జీషీటు దాఖలైంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఎంజీ రాజాపై 2015లో సీబీఐ కేసు నమోదుచేసింది.