Nithyananda: ఆసియా గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో నిత్యానంద
ABN , First Publish Date - 2022-10-30T10:44:13+05:30 IST
దేశాధ్యక్షుడుగా వ్యవరిస్తున్న నిత్యానందస్వామి(Nithyananda Swamy) 8 సాధనలు చేసిన ఆసియా బుక్ ఆఫ్
పెరంబూర్(చెన్నై), అక్టోబరు 29: దేశాధ్యక్షుడుగా వ్యవరిస్తున్న నిత్యానందస్వామి(Nithyananda Swamy) 8 సాధనలు చేసిన ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నారని కైలాస అధికారపూర్వ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అమెరికా రాజధాని న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి 77వ జనరల్ కౌన్సిల్ సమావేశంలో కైలాస తరఫున, ఐ.రా.స రాయబారిగా నియమితులైన విజయప్రియ నిత్యానంద హాజరయ్యారు. సమావేశంలో పలు దేశాల అధ్యక్షులతో సమావేశమైన విజయప్రియ, కైలాస రాజ్యాంగంగా చెబుతున్న భగవద్గీత అందించి కలకలం రేపారు. ఈ నేపథ్యంలో, 7 సాధనాలు నిత్యానంద ఆసియా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైనట్లు కైలాస అధికారపూర్వక ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. గంటలో ఎక్కువ శ్లోకాలు జపించడం, ఎక్కువ సమయం రుద్ర మంత్రం జపించడం, జీవించి ఉన్న వ్యక్తికి ఎక్కువ స్తోత్రాలు అంకితం చేయడం, బృందంగా సాంప్రదాయ ఆసనాలు ప్రదర్శన, ఆధ్యాత్మికంగా అనేక బ్రహ్మోత్సవాల నిర్వహణ, అధిక సమయం పద్మాసనం, సుదీర్ఘ ప్రసంగం చేయడం సహా 7 సాధనలు చేసిన నిత్యానంద బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నట్లు కైలాస ప్రకటించింది.