Video Viral: జంటకు వేధింపులు.. మైనర్‌తోపాటు పలువురు అరెస్ట్
ABN , Publish Date - Apr 11 , 2025 | 05:19 PM
Video Viral: బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని ఓ పార్క్ బయట బైక్‌పై ఓ జంట ఎదురెదురుగా కూర్చొన్నారు. ఈ నేపథ్యంలో వారితో పలువురు వ్యక్తులు వాగ్వివాదానికి దిగారు. ఆ క్రమంలో యువతితో దుర్బాషలాడారు. ఈ నేపథ్యంలో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఓ మైనర్ కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.

బెంగళూరు, ఏప్రిల్ 11: బెంగళూరులోని ఒక జంటను వేధింపులకు గురి చేసిన ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామని నగర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గిరీష్ వెల్లడించారు. వారిలో ఒక మైనర్ కూడా ఉన్నాడని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని ఓ పార్క్ బయట బైక్‌పై ఓ జంట ఎదురెదురుగా కూర్చొన్నారు.
ఆ సమయంలో పార్కు నుంచి బయటకు వచ్చిన ఐదుగురు వ్యక్తులు.. ఆ జంటతో వాగ్వివాదానికి దిగారు. వేర్వేరు మతాల వారు ఇలా చేయడం తగదంటూ హెచ్చరించారు. ఆ క్రమంలో బురఖా వేసుకున్న మహిళతో మీ ఇల్లు ఎక్కడా అంటూ వారు ప్రశ్నించారు. అదే సమయంలో ఆమెతో వారు తీవ్ర దుర్భాషలాడారు. ఈ వ్యవహారం మొత్తాన్ని అక్కడే ఉన్న మహిళ వీడియో తీసింది.
ఈ వ్యవహారంపై తమకు మహిళ నుంచి అందిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామన్నారు. మరోవైపు ఈ కేసులో ఎటువంటి హింస జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు. అయితే మరో వీడియోలో మాత్రం బైక్‌పై మహిళతో కూర్చొన్న వ్యక్తిని కర్రతో కొడుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ వ్యవహారంపై ఐదుగురు వ్యక్తులను విచారిస్తున్నామన్నారు.
ఇంకోవైపు ఈ వ్యవహారంపై కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే స్పందించారు. ఈ తరహా సంఘటనలను సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ తరహా ఘటలను బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చోటు చేసుకుంటాయని.. అంతేకానీ ప్రగతీ శీల రాష్ట్రమైన కర్ణాటకలో ఈ తరహా ఘటనలు చోటు లేదని ఆయన స్పష్టం చేశారు.
For National News And Telugu News