పెళ్లయిందా.. పిల్లలెప్పుడు మరి?
ABN , First Publish Date - 2022-10-28T05:06:48+05:30 IST
చైనాలోని గృహస్థులకు ప్రభుత్వం నుంచి వింత ఫోన్లు వస్తున్నాయి. కాల్ చేసి.. ‘‘మీకు కొత్తగా పెళ్లయిందా?’’ అని అడుగుతారు.

చైనీయులకు ప్రభుత్వం ఫోన్లు
హాంగ్‌కాంగ్, అక్టోబరు 27: చైనాలోని గృహస్థులకు ప్రభుత్వం నుంచి వింత ఫోన్లు వస్తున్నాయి. కాల్ చేసి.. ‘‘మీకు కొత్తగా పెళ్లయిందా?’’ అని అడుగుతారు. ‘‘అవును’’ అని చెప్పారే అనుకోండి.. ‘‘పిల్లలను ఎప్పుడు కంటారు?’’ అనే ప్రశ్న ఎదురవుతుంది! నవ దంపతుల్లో చాలామందికి ఇప్పుడు ఇవే ఫోన్ కాల్స్ వస్తున్నాయి. దేశంలో జననాల రేటు ఏటికేడు పడిపోతుండటంపై చైనా ఆందోళన చెందుతోంది. గత ఏడాది శిశు జననాలు 1.6 కోట్లు ఉంటే ఈ ఏడాది కోటికి పడిపోయింది. దీంతో స్థానిక ప్రభుత్వాలు పిల్లలు లేని దంపతులకు ఫోన్లు చేస్తూ ‘‘ఇంకా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోలేదా?’’ అంటూ గట్టిగా నిలదీస్తున్నారు.