Viral News: పోలీస్ కస్టడీలో కోళ్లు.. వైద్య పరీక్షలు పూర్తైన తర్వాత విడుదల!

ABN , First Publish Date - 2022-12-30T12:30:03+05:30 IST

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. పోలీసులు రెండు కోళ్లను అదుపులోకి తీసుకుని.. వాటిని రెండు రోజులపాటు స్టేషన్‌లోనే బంధించారని తెలిసి నెటిజన్లు షాకవుతున్నారు. అంతేకాదు.. వైద్య పరీక్షల తర్వాత వాటిని విడుదల..

Viral News: పోలీస్ కస్టడీలో కోళ్లు.. వైద్య పరీక్షలు పూర్తైన తర్వాత విడుదల!

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. పోలీసులు రెండు కోళ్లను అదుపులోకి తీసుకుని.. వాటిని రెండు రోజులపాటు స్టేషన్‌లోనే బంధించారని తెలిసి నెటిజన్లు షాకవుతున్నారు. అంతేకాదు.. వైద్య పరీక్షల తర్వాత వాటిని విడుదల చేసినట్టు తెలుసుకుని నెటిజన్లు మరింత విస్తుపోతున్నారు. వినడానికి షాకింగ్‌గా అనిపించినా ఇది నిజం. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ వింత ఘటన ఒడిశా(Odisha)లో చోటు చేసుకుంది. కోళ్ల పందాలు నిర్వహించడం, అందులో పాల్గొనడం చట్టరీత్య నేరం అన్న విషయం అందరికీ తెలసిందే. పోలీసులు పదే పదే ఈ విషయంలో హెచ్చరిస్తూ ఉంటారు. పోలీసులు ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా కొందరు మాత్రం అస్సలు వెనక్కి తగ్గరు. ఈ క్రమంలోనే బాలాసోర్ జిల్లాలోని మంజరిపురా గ్రామంలోని కొందరు వ్యక్తులు డిసెంబర్ 25న కోళ్ల పందాలను నిర్వహించారు. ఈ విషయం కాస్తా పోలీసుల(Odisha Police)కు తెలిసింది. దీంతో మఫ్టీ‌లో అక్కడకు చేరుకున్న అధికారులు.. పందాలు మొదలవ్వగానే దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే పందాలు నిర్వహిస్తున్న వారితోపాటు కోళ్లను కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: Royal Enfield: బుల్లెట్ బండి ధర కేవలం రూ.19వేలు.. మరీ ఇంత తక్కువకా!

అలా అదుపులోకి తీసుకున్న కోళ్లను.. రెండు రోజులపాటు స్టేషన్‌లోనే(Hens in Police Custody) బంధించారు. ఆ తర్వాత వాటి యజమానులను పిలిపించి వార్నింగ్ ఇచ్చారు. అనంతరం వెటర్నిటీ వైద్యుడి వద్ద కోళ్లకు వైద్య పరీక్షలు చేయించి.. వాటిని యజమానులకు అప్పగించారు. కోళ్ల పోషణ, వైద్య పరీక్షల కోసం అధికారులు దాదాపు రూ.5వేల వరకూ ఖర్చు పెట్టినట్టు సమాచారం. కాగా.. ఈ వార్త స్థానికంగా చర్చనీయాంశం అవడంతో.. నెట్టింటికి చేరింది. దీంతో అధికారులు చేసిన పని గురించి తెలుసుకుని నెటిజన్లు షాకవుతున్నారు.

Updated Date - 2022-12-30T12:46:43+05:30 IST