Virat Kohli: కోహ్లీ సంచలన నిర్ణయం.. రూ.110 కోట్ల డీల్‌కు గుడ్‌బై
ABN , Publish Date - Apr 11 , 2025 | 03:19 PM
IPL 2025: టీమిండియా కింగ్ విరాట్ కోహ్లీ చేజేతులా కోట్ల రూపాయలు మిస్ అయ్యాడు. ఏకంగా రూ.110 కోట్ల డీల్‌ను వద్దనుకున్నాడు టాప్ బ్యాటర్. మరి.. కింగ్ ఇలా ఎందుకు చేశాడో ఇప్పుడు చూద్దాం..

డబ్బులు ఎవరు వద్దనుకుంటారు చెప్పండి.. మనీ వస్తోందంటే ఎవ్వరైనా తీసుకుంటారు. టాప్ సెలెబ్రిటీస్ అయినా సరే.. డబ్బులు వద్దనరు. అందునా కోట్ల రూపాయల డీల్స్ అంటే ఎగిరి గంతేస్తారు. అయితే టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాత్రం ఏకంగా రూ.110 కోట్ల డీల్‌కు ససేమిరా నో చెప్పేశాడు. అక్షరాలా నూటా పది కోట్ల రూపాయల్ని చేజేతులా మిస్ చేసుకున్నాడు. మరి.. ఇంత భారీ మొత్తాన్ని విరాట్ ఎందుకు వద్దనుకున్నాడు.. బిగ్ డీల్‌కు కింగ్ ఎందుకు నో చెప్పాడు.. దీని వెనుక ఉన్న రీజన్ ఏంటి.. కోహ్లీ చేసింది కరెక్టా.. రాంగా.. అనేది ఇప్పుడు చూద్దాం..
8 ఏళ్ల బంధానికి ఫుల్‌స్టాప్
మైదానంలో పరుగుల మోత మోగించే కోహ్లీ.. బయట బిజినెస్‌లోనూ హవా చూపిస్తున్నాడు. ఒకవైపు క్రికెట్ కెరీర్‌ను చక్కగా డిజైన్ చేసుకున్న విరాట్.. మరోవైపు వ్యాపారంలోనూ దూసుకెళ్తున్నాడు. యాడ్స్ చేస్తూ భారీగా వెనకేసుకుంటున్న స్టార్ బ్యాటర్.. హోటల్, క్లోతింగ్ బిజినెస్‌లోకి దిగి అక్కడా మంచి లాభాలు గడిస్తున్నాడు. అలాంటోడు తాజాగా పూమా డీల్‌కు నో చెప్పేశాడని తెలుస్తోంది. గత 8 ఏళ్లుగా ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న కోహ్లీ.. తాజాగా దీన్ని వదులుకున్నాడని సమాచారం. ఈ డీల్ విలువ అక్షరాలా రూ.110 కోట్లు అని వినిపిస్తోంది.
సొంత కంపెనీ కోసం..
కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి పూమాకు సంబంధించిన అన్ని ప్రమోషనల్ యాడ్స్‌ను తొలగించడంతో ఈ గాసిప్స్ మరింత ఊపందుకున్నాయి. ఈ పోస్ట్‌లను రీల్స్ సెక్షన్‌కు మార్చడంతో పూమాతో విరాట్ అనుబంధం ముగిసిందనే రూమర్స్ ఎక్కువయ్యాయి. దుస్తులు, ఫుట్‌వేర్ తదితర ఉత్పత్తులను సేల్ చేస్తున్న తన సొంత సంస్థ వన్8ను డెవలప్ చేసే ప్రయత్నాల్లో ఉన్న విరాట్.. ఇందులో భాగంగానే పూమాకు గుడ్‌బై చెప్పాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వన్8ను గ్లోబల్ బ్రాండ్‌గా మార్చాలనే ఉద్దేశంతోనే కోట్ల విలువ చేసే పూమా డీల్‌ను కోహ్లీ వదులుకున్నాడని సమాచారం. ఇకపై వన్8ను తన సోషల్ మీడియా ఖాతాల్లో విపరీతంగా ప్రచారం చేయడం, ప్రమోషన్స్‌తో బ్రాండ్ ఉత్పత్తులను జనాల్లోకి వేగంగా తీసుకెళ్లే ఆలోచనల్లో ఉన్నాడట స్టార్ బ్యాటర్.
ఇవీ చదవండి:
రాహుల్.. ఇంత కోపం దాచుకున్నాడా..
64 ఏళ్ల వయసులో క్రికెట్ డెబ్యూ
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి