Funny Mosquito Video: దోమలపై మరీ ఇంత కోపమా.. ఎలా చంపుతున్నాడో చూస్తే అవాక్కవుతారు..
ABN , Publish Date - Apr 11 , 2025 | 01:45 PM
దోమల బెడదతో బాగా విసిగిపోయిన ఓ వ్యక్తి.. ఎలాగైనా వాటిపై కక్ష తీర్చుకోవాలని ఫిక్స్ అయ్యాడు. ఇందుకోసం వివిధ రకాలుగా ఆలోచించి చివరకు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఇతడు చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కువుతున్నారు..

దోమల బెడద ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాటి బెడదను నివారించేందుకు చాలా మంది వివిధ రకాల ప్రయత్నిస్తుంటారు. కొందరు దోమల కాయిల్స్ వాడితే.. మరికొందరు ఆల్ అవుట్ వంటి సాధనాలను వాడుతుంటారు. ఆ కొద్దిసేపు ఉపశమనం లభించినా మళ్లీ దోమలు యథావిధిగా దాడి చేయడం స్టార్ట్ చేస్తుంటాయి. ఇలాంటప్పుడే వాటిని చంపేయాలి.. అన్నంత కోపం వస్తుంటుంది. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నామంటే.. ఓ వ్యక్తికి ఇలాగే కోపం కట్టలు తెంచుకున్నట్లుంది. చివరకు ఏం చేశాడో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. దోమల బెడదతో బాగా విసిగిపోయిన ఓ వ్యక్తి.. ఎలాగైనా వాటిపై కక్ష తీర్చుకోవాలని ఫిక్స్ అయ్యాడు. ఇందుకోసం వివిధ రకాలుగా ఆలోచించి.. చివరకు ఓ లైటు, దోమల బ్యాటుతో (Anti Mosquito Racquet) ఇంటి బయటికి వెళ్లాడు.
Lions VS Buffaloes: చుట్టుముట్టిన సింహాలతో గేదె పోరాటం.. చివరకు జరిగిందేంటో మీరే చూడండి..
చెట్ల వద్దకు వెళ్లి లైటు వేయగా.. దోమలన్నీ వెలుతురులోకి వచ్చేశాయి. తర్వాత తన చేతిలోని రాకెట్‌ను (Man killed mosquitoes with Anti Mosquito Racquet) అటూ, ఇటూ తిప్పుతూ దోమలను చంపేశాడు. ఇలా వెలుతురులోకి వచ్చిన దోమలన్నింటినీ ఆ రాకెట్‌తో చంపేసి తన కోపాన్ని చల్లార్చుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ ఇతన్ని నరకంలో కబాబ్ చేయడం పక్కా’’.. అంటూ కొందరు, ‘‘ఇతడి కోసం నరకంలో ప్రత్యేకమైన హాట్ సీట్ సిద్ధంగా ఉంటుంది’’.. అంటూ మరికొందరు, ‘‘దోమలపై కసి తీర్చుకున్నాడుగా’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 61 వేలకు పైగా లైక్‌లు, 2.8 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Crocodile VS Python: పట్టుకున్న మొసలి.. చుట్టేసిన కొండచిలువ.. చివరకు షాకింగ్ ట్విస్ట్..
ఇవి కూడా చదవండి..
Viral Video: నీళ్లే కదా అని ఈత కొడుతున్నారా.. రాయి వేసి చూడగా ఏమైందో చూడండి..