హనీమూన్ నుంచి రాగానే పోలీస్ స్టేషన్కు వెళ్లిన భార్య.. భర్త తప్పు చేశాడంటూ ఫిర్యాదు చేయడంతో.. చివరకు..
ABN , First Publish Date - 2022-12-25T16:07:44+05:30 IST
వారిద్దరూ ఒకరికొకరికి నచ్చడంతో పెద్దలు ఘనంగా వివాహం చేశారు. ఆర్థికపరంగా ఎలాంటి ఇబ్బందులూ లేకపోవడంతో హనీమూన్ వెళ్లేందుకు భర్త.. గ్రాండ్గా ప్లాన్ చేశాడు. అంతా బాగానే ఉన్నా, హనీమూన్ వెళ్లాక.. అసలు సమస్య ఎదురైంది. తాను చెప్పినట్లుగా శృంగారం చేయాలని..
వారిద్దరూ ఒకరికొకరికి నచ్చడంతో పెద్దలు ఘనంగా వివాహం చేశారు. ఆర్థికపరంగా ఎలాంటి ఇబ్బందులూ లేకపోవడంతో హనీమూన్ వెళ్లేందుకు భర్త.. గ్రాండ్గా ప్లాన్ చేశాడు. అంతా బాగానే ఉన్నా, హనీమూన్ వెళ్లాక.. అసలు సమస్య ఎదురైంది. తాను చెప్పినట్లుగా శృంగారం చేయాలని భర్త ఒత్తిడి చేయడంతో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో సమస్య చివరకు పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. వివరాల్లోకి వెళితే..
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ప్రేమికులు.. నన్ను పెళ్లిచేసుకో.. అని యువతి అడగడంతో.. ఒక్కసారిగా..
హర్యానాలోని (Haryana) గురుగ్రామ్ పరిధికి చెందిన అభినవ్ వశిష్ట్ అనే వ్యక్తికి ఇటీవల ఓ యువతితో (young woman) వివాహమైంది. ఆర్థికపరంగా ఎలాంటి ఇబ్బందీ లేకపోవడంతో తన హనీమూన్ గ్రాండ్గా ప్లాన్ చేశాడు. భార్యను ఏకంగా మాల్దీవులకు తీసుకెళ్లాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. భార్యతో అసహజ రీతిలో శృంగారం చేయడంతో భార్య అడ్డుకుంది. ఇలాంటివి నాకు నచ్చవు.. అంటూ తిరస్కరించింది. అయినా భర్త తన భార్యను బలవంతం (Indecent behavior) చేశాడు. అయినా ఒప్పుకోకపోవడంతో మరుసటి రోజు ఆమెకు మత్తు మాత్రలు ఇచ్చి మరీ దారుణానికి పాల్పడ్డాడు.
ఇలా రోజూ చేస్తుండడంతో ఆమెకు విరక్తి కలిగింది. అయినా ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేక అలాగే భరించింది. అయితే రోజు రోజుకూ భర్త ప్రవర్తన దారుణంగా ఉండడంతో భరించలేకపోయింది. ఇంటికి తిరిగి వచ్చాక.. అత్తమామలు అదనపు కట్నం పేరుతో (Dowry harassment) చిత్రహింసలు చేయడం మొదలెట్టారు. దీంతో చివరకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. బాధితురాలిని విచారించిన అనంతరం.. ఆమె భర్త, అత్తమామలు, బావ తదితరులుపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.
మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం.. మూడు నెలలుగా పుట్టింట్లో ఉన్న భార్య.. సడన్గా అక్కడికి వెళ్లిన భర్త..