ఆసీస్ క్లీన్‌స్వీప్
ABN , First Publish Date - 2022-12-12T04:52:26+05:30 IST
వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీ్‌సను ఆస్ట్రేలియా 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆసీస్ బౌలర్ల ధాటికి చివరిదైన రెండో టెస్టు నాలుగో రోజే
అడిలైడ్: వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీ్‌సను ఆస్ట్రేలియా 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆసీస్ బౌలర్ల ధాటికి చివరిదైన రెండో టెస్టు నాలుగో రోజే ముగిసింది. 497 పరుగుల భారీ లక్ష్యంతో ఓవర్‌నైట్ స్కోరు 38/4తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్ 77 రన్స్‌కే కుప్పకూలింది. స్టార్ట్, నెసెర్, బోలండ్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. చందర్‌పాల్ చేసిన 17 పరుగులే అత్యధికం. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 511/7 (డిక్లేర్), రెండో ఇన్నింగ్స్‌లో 199/6 (డిక్లేర్) చేయగా.. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 214 రన్స్ చేసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా హెడ్.. మ్యాన్ ఆఫ్ ద సిరీ్‌సగా లబుషేన్ నిలిచారు.