పోటీలో గాయపడి కోమాలోకి వెళ్లిన kickboxer మృతి
ABN , First Publish Date - 2022-07-15T00:44:33+05:30 IST
పోటీల్లో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన కిక్బాక్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బెంగళూరులో

బెంగళూరు: పోటీల్లో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన కిక్బాక్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బెంగళూరులో జరిగిందీ ఘటన. మైసూరుకు చెందిన కిక్బాక్సర్ నిఖిల్ బెంగళూరులోని జ్ఞానజ్యోతినగర్లోని ఓ జిమ్‌లో ఈ నెల 10న నిర్వహించిన రాష్ట్రస్థాయి ‘K1 Kickboxing championship' పోటీల్లో పాల్గొన్నాడు. ప్రత్యర్థితో తలపడుతున్న సమయంలో దెబ్బ తగలడంతో నిఖిల్ ఒక్కసారిగా బాక్సింగ్ రింగ్‌లో కుప్పకూలిపోయాడు.
వెంటనే అతడిని సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రెండు రోజులపాటు కోమాలో ఉన్న నిఖిల్ ఈ నెల 12న మృతి చెందాడు. నిఖిల్ తండ్రి సురేష్ ఫిర్యాదుతో నవీన్ రవిశంకర్‌తోపాటు అసోసియేషన్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.