Hyderabad: నల్లాలకు బిగించిన మోటర్లు సీజ్..
ABN , Publish Date - Apr 12 , 2025 | 08:35 AM
గత కొంతకాలంగా నల్లాలకు మోటర్లు బిగించిన యధేచ్చగా నీటిని వాడుకోవడంపై గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ అధికారులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా మోటర్లను సీజ్ చేస్తున్నారు. దీంతో నల్లాలకు అక్రమంగా మోటర్లు బిగించిన వారి గుండెల్లో గుబులు మొదలైంది.

పలు ప్రాంతాల్లో విజిలెన్స్ తనిఖీలు
హైదరాబాద్ సిటీ: నల్లాలకు మోటర్లను బిగించడంపై వాటర్‌బోర్డు విజిలెన్స్ అధికారులు(Water Board Vigilance Officers) కొరడా ఝులిపిస్తున్నారు. శుక్రవారం నగరంలోని మూసారాంబాగ్ సెక్షన్ పరిధి శాలివాహన నగర్ రోడ్(Shalivahana Nagar Road)లో నీటి సరఫరా సమయంలో తనిఖీలు నిర్వహించారు. రోడ్డు నంబర్ 12, 13, 14 ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి తనిఖీలు చేశారు. నల్లా పైపులైనుకు నేరుగా మోటార్లు బిగించి నీటిని అక్రమంగా తోడుతున్న వినియోగదారులను గుర్తించారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: చదివింది బీఎస్సీ.. చేసేది స్మగ్లింగ్
వారికి చెందిన 8 మోటర్లను స్వాధీనం చేసుకున్నారు. మోటర్ల వినియోగం వల్ల పలు ప్రాంతాల్లోని వినియోగదారులకు లో ప్రెషర్‌తో నీటి సరఫరా అవుతున్న నేపథ్యంలో విజిలెన్స్ బృందాలు రంగంలోకి దిగాయి. ఈనెల 15వ తేదీ నుంచి వాటర్‌బోర్డు క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారులు కూడా రంగంలోకి దిగనున్నారు. ఎవరైనా వినియోగదారులు ఇలా తమ నల్లాలకు మోటార్లు బిగించి పట్టుబడితే.. వారిపై వాటర్‌బోర్డు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు మోటార్లు సీజ్ చేస్తారు.
రెండోసారి మోటార్లు బిగిస్తే రూ.5వేలు జరిమానా విధించి కేసులు నమోదు చేస్తారు. వినియోగదారులెవరూ నల్లాకు మోటార్లు బిగించొద్దని వాటర్‌బోర్డు విజ్ఞప్తి చేస్తోంది. లో ప్రెషర్ సమస్యలు తలెత్తితే దగ్గరలోని సంబంధిత బోర్డు మేనేజర్, డీజీఎం, జీఎం అధికారులను సంప్రదించాలని, లేకుంటే కస్టమర్ కేర్ నంబరు 155313కి ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుని సమస్యలను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
రోడ్డుకీడుస్తా... కసి తీరే వరకు చంపుతా
ఒక్క క్లిక్‌తో స్థలాల సమస్త సమాచారం!
రైల్వే తీరుతో ప్రయాణికుల పరేషాన్
Read Latest Telangana News and National News