Bangladesh: కోహ్లీ ఫేక్‌ ఫీల్డింగ్‌ వల్లే ఓడాం!

ABN , First Publish Date - 2022-11-04T03:56:01+05:30 IST

భారత్‌ చేతిలో ఆఖరి బంతికి ఓడిన బంగ్లాదేశ్‌ జట్టు ఇప్పుడు తమ ఓటమికి సాకులు వెతుకుతోంది. తాజా ఓటమికి విరాట్‌ కోహ్లీ ఫేక్‌ ఫీల్డింగే కారణమని ఆ జట్టు కీపర్‌ నూరుల్‌ హసన్‌ ఆరోపిస్తున్నాడు. ‘

 Bangladesh: కోహ్లీ ఫేక్‌ ఫీల్డింగ్‌ వల్లే ఓడాం!
Bangladesh

బంగ్లా అక్కసు

అడిలైడ్‌: భారత్‌ చేతిలో ఆఖరి బంతికి ఓడిన బంగ్లాదేశ్‌ జట్టు ఇప్పుడు తమ ఓటమికి సాకులు వెతుకుతోంది. తాజా ఓటమికి విరాట్‌ కోహ్లీ ఫేక్‌ ఫీల్డింగే కారణమని ఆ జట్టు కీపర్‌ నూరుల్‌ హసన్‌ ఆరోపిస్తున్నాడు. ‘మ్యాచ్‌ మధ్యలో కోహ్లీ ఫీల్డింగ్‌ చేస్తున్నట్టు నటించాడు. అతడి చర్య వల్ల మాకు ఐదు పెనాల్టీ పరుగులు రావాల్సి ఉన్నా అలా జరగలేదు’ అని హసన్‌ అన్నాడు. జరిగిందేమిటంటే.. బంగ్లా ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్‌లో డీప్‌ వికెట్‌ నుంచి అర్ష్‌దీప్‌ బంతిని కీపర్‌ వైపు విసిరాడు. కానీ పాయింట్‌లో ఉన్న కోహ్లీ కూడా చేతిలో బంతి లేకపోయినా నాన్‌స్ట్రయికింగ్‌ ఎండ్‌ వైపు విసిరినట్టు కనిపించాడు. ఐసీసీ రూల్‌ ప్రకారం ‘బ్యాటర్‌ను ఉద్దేశపూర్వకంగా మోసం చేయడం, అడ్డుకోవడం’ చేయకూడదు.

Updated Date - 2022-11-04T03:56:04+05:30 IST