Auro Sammelan: ఉత్సాహభరితంగా ఆరో సమ్మేళన్ పోటీలు
ABN , First Publish Date - 2022-11-09T16:03:32+05:30 IST
హైదరాబాద్: శ్రీ అరబిందో 150వ జయంతి ఉత్సవాల వేళ కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో...
హైదరాబాద్: శ్రీ అరబిందో 150వ జయంతి ఉత్సవాల వేళ కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ స్టడీ నేతృత్వంలో విద్యానగర్‌లోని శ్రీ అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్‌లో విద్యార్ధులకు అరో సమ్మేళన్ పోటీలు జరిగాయి. హైదరాబాద్ జంట నగరాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న విద్యాసంస్థల నుంచి 150 మంది విద్యార్ధులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. సెయింట్ మార్టిన్స్, నాసర్, జాన్సన్ గ్రామర్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, న్యూ డెైమన్షన్స్ స్కూల్ (భువనగిరి), పల్లవి విద్యాసంస్థలు, రెడ్డి జూనియర్, డిగ్రీ కళాశాలలు, ఆంధ్ర మహిళా సభ విద్యార్ధులు పోటీల్లో పాల్గొన్నారు. పోటీలకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్ధులను ఉద్దేశించి ప్రసంగించారు. శ్రీ అరబిందో రచించిన భవానీ భారతి సంస్కృత పద్య పఠనంతో పాటు భగవద్గీత శ్లోకాల పఠనం, వ్యాసరచన, ఇంగ్లీష్ పద్యగానం, పెయింటింగ్ తదితర పోటీలు నిర్వహించారు.
8 నుంచి 12వ తరగతి విద్యార్ధులకు నవంబర్ నెల చివరలో వరంగల్, జనగాంమలో గ్రాడ్యుయేట్ లెవెల్ పోటీలు నిర్వహించబోతున్నామని నిర్వాహకులు తెలిపారు.