CM KCR: సంక్షేమం, పెండింగ్ పనులపై ప్రగతిభవన్లో సీఎం సమీక్ష
ABN , First Publish Date - 2022-11-27T12:15:27+05:30 IST
నిజామాబాద్ జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, పెండింగ్ పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆదివారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, పెండింగ్ పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆదివారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ప్రశాంత్ రెడ్డి , ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గణేష్ గుప్తా, షకీల్ అహ్మద్, ఎమ్మెల్సీ కవిత, మునిసిపల్ అధికారులు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ చిత్ర మిశ్రా, పలువురు అధికారులు హాజరయ్యారు. జిల్లాల వ్యాప్తంగా సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు పూర్తి అయిన పనులు, పెండింగ్ పనుల పురోగతిపై చర్చించారు. ఇక మీదట జిల్లాల వారీగా సీఎం కేసీఆర్ సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు.