Share News

Sheep Distribution Scam: పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌ను విచారిస్తున్న ఈడీ

ABN , Publish Date - Apr 16 , 2025 | 02:01 PM

గొర్రెల స్కీంకు సంబంధించిన పూర్తి వివరాలను ఈడీ అధికారులు తెప్పించుకున్నారు. వాటి ఆధారంగా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ రావును విచారిస్తున్నారు. గొర్రెల స్కాంలో దళారులు మొయినుద్దీన్, ఈక్రముద్దీన్‌పై అధికారులు అరా తీస్తున్నారు.

Sheep Distribution Scam: పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌ను విచారిస్తున్న ఈడీ
Sheep Distribution Scam

హైదరాబాద్: గొర్రెల పంపిణీ స్కాము కేసు (Sheep Distribution Scam Case)లో విచారణను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) వేగవంతం చేసింది. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణి జరిగింది. అయితే ఈ స్కీంలో రూ. 700 కోట్ల అవినీతి (Rs. 700 crore corruption) జరిగిందని ఏసీబీ (ACB) కేసు నమోదు చేసింది. ఈ కేసులో పలువురిని అరెస్టు (Arrest) చేసి రిమాండ్‌కు (Remand) పంపింది. ఏసీబీ కేసు ఆధారంగా ఈసీఐఆర్ (ECIR) నమోదు చేసిన ఈడీ అధికారులు బుధవారం పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌ను (Assistant Director of Animal Husbandry Department) విచారిస్తోంది. ఇప్పటికే గొర్రెల స్కీంకు సంబంధించిన పూర్తి వివరాలను ఈడీ అధికారులు తెప్పించుకున్నారు. వాటి ఆధారంగా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు (Srinivasarao)ను విచారిస్తున్నారు. గొర్రెల స్కాంలో దళారులు మొయినుద్దీన్, ఈక్రముద్దీన్‌పై అధికారులు అరా తీస్తున్నారు. గొర్రెల స్కీం మొదలు పంపిణీ, యూనిట్ల సేకరణ వీటన్నిటిపై ఈడీ అధికారులు అరా తీస్తున్నారు. అలాగే ప్రభుత్వ నిధుల చెల్లింపునకు సంబంధించిన వివరాలపై కూడా అధికారులు విచారిస్తున్నారు.

Also Read..: దాసాంజనేయ స్వామి ప్రతిష్టాపన మహోత్సవం


కాగా గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాలను మనీ లాండరింగ్‌ కేసుగా ఈడీ విచారణకు స్వీకరించింది. కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకంలో చోటుచేసుకున్న అక్రమాలపై ఏసీబీ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. గొర్రెల కొనుగోళ్ల పేరిట రూ.700 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసులో పెద్దఎత్తున డబ్బు చేతులు మారడం, ఇతర రాష్ట్రాలకూ లింకు ఉండడంతో ఈడీ రంగంలోకి దిగింది. పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలంటూ ఇప్పటికే గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్యకు హైదరాబాద్‌లోని ఈడీ జోనల్‌ కార్యాలయం లేఖ రాసింది. జిల్లాల వారీగా లబ్ధిదారుల వివరాలు, అడ్రస్‌, కాంటాక్ట్‌ సెల్‌ నంబర్లు, బ్యాంకు ఖాతా నంబరు, బ్యాంకు పేరు, బ్రాంచి పేరు తదితర వివరాలను ఇవ్వాలని కోరింది. జిల్లాలవారీగా లబ్ధిదారులకు గొర్రెలు అమ్మిన యజమానుల పూర్తి వివరాలు కూడా సమర్పించాలని స్పష్టం చేసింది. గొర్రెలు, మేకల సహకార అభివృద్ధి సంస్థకు సంబంధించిన ఏ బ్యాంకు ఖాతా నుంచి నిధులు బదిలీ చేశారు.. బ్యాంకు- బ్రాంచి వివరాలు ఏమిటి.. జిల్లాలవారీగా లబ్ధిదారులు తమ వాటా ధనాన్ని ఏ బ్యాంకు ఖాతా నుంచి ఏ బ్యాంకు ఖాతాకు జమ చేశారు.. ట్రాన్స్‌పోర్టు ఏజెన్సీలు, రవాణా చేసిన వాహనాలు, గొర్రెల యూనిట్ల వివరాలు కూడా ఇవ్వాలని కోరింది.


ఈ వార్తలు కూడా చదవండి..

CM Chandrababu: ప్రత్యేక సాయం ఇచ్చేలా చూడండి..

వైసీపీ హయాంలో శ్రీవారి ఆలయంలో భారీ స్కాం..

సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో రెండోసారి ఈడీ సోదాలు..

For More AP News and Telugu News

Updated Date - Apr 16 , 2025 | 02:01 PM