మునుగోడులో కాంగ్రెస్‌ ధర్మ యుద్ధం

ABN , First Publish Date - 2022-10-31T03:51:56+05:30 IST

మునుగోడులో జరుగుతున్నవి సామాన్యమైన ఎన్నికలు కావని ఈ ఎన్నికలు 2023 ఎన్నికలకు నాందిని పలుకుతాయని మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అన్నారు.

మునుగోడులో కాంగ్రెస్‌ ధర్మ యుద్ధం
SRAVANTHI

ప్రజలు నిజాయితీని గెలిపిస్తారు: పాల్వాయి స్రవంతి

హయత్‌నగర్‌, అక్టోబర్‌ 30 (ఆంధ్రజ్యోతి): మునుగోడులో జరుగుతున్నవి సామాన్యమైన ఎన్నికలు కావని ఈ ఎన్నికలు 2023 ఎన్నికలకు నాందిని పలుకుతాయని మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అన్నారు. మునుగోడులో జరుగుతున్న ధర్మ యుద్ధంలో ప్రజలు నిజాయితీనే గెలిపిస్తారని అన్నారు. సొంతంగా డబ్బులు ఖర్చు చేసి కాంగ్రెస్‌ కార్యకర్తలు రాజగోపాల్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. సొంత అవసరాల కోసం తల్లిలాంటి కాంగ్రెస్‌ పార్టీని మోసం చేసి బీజేపీలో చేరారని విమర్శించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని మంత్రులు చెబుతున్నారని, అలాంటప్పుడు కౌరవులుగా అంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు ఎందుకు నియోజకవర్గంలో మకాం వేశారని ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ నాయకులు అరాచకాలు సృష్టిస్తున్నారని, తనపై, కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారన్నారు.

Updated Date - 2022-10-31T03:51:57+05:30 IST