Chittoor: కూతురి జ్ఞాపకాలు మరవలేక.. రైలు కిందపడి తండ్రి ఆత్మహత్య
ABN , Publish Date - Mar 01 , 2025 | 12:35 PM
నెల రోజుల క్రితం పెళ్లిపీటకెక్కాల్సి రోజున కూతురు గూడూరు పంబలేరు వాగులో శవమై తేలింది. అప్పటి నుంచి కుమార్తె జ్ఞాపకాలను మరిచిపోలేక మనోవేదనకు గురైన తండ్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకొన్న హృదయ విదారకర ఘటన శుక్రవారం సూళ్లూరుపేటలో చోటుచేసుకొంది.

సూళ్లూరుపేట(చిత్తూరు): నెల రోజుల క్రితం పెళ్లిపీటకెక్కాల్సి రోజున కూతురు గూడూరు పంబలేరు వాగులో శవమై తేలింది. అప్పటి నుంచి కుమార్తె జ్ఞాపకాలను మరిచిపోలేక మనోవేదనకు గురైన తండ్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకొన్న హృదయ విదారకర ఘటన శుక్రవారం సూళ్లూరుపేట(Sullurpet)లో చోటుచేసుకొంది. సూళ్లూరుపేట పట్టణంలోని రాఘవయ్యపేటకు చెందిన శామ్యూల్ జయకుమార్ (59) శుక్రవారం తెల్లవారుజామున స్థానిక రైల్వేగేటు సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకొన్నాడు.
ఈ వార్తను కూడా చదవండి: Anitha: వైసీపీ నేతలకు హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్
మృతుడి బంధువుల సమాచారం మేరకు... జయకుమార్ కూతురు లేహానిస్సీకి బంధువుల అబ్బాయితో జనవరి 30వ తేదీన వివాహం జరిపించేందుకు గత ఏడాది డిసెంబరు 14న నిశ్చితార్ధం చేశారు. ఈ నేపథ్యంలో జనవరి 20న లేహానిస్సీ కళాశాలకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లింది. తిరిగి ఇంటికి రాకపోవడంతో జనవరి 21న సూళ్లూరుపేట పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. జనవరి 29న కళాశాల పక్కనే ఉన్న పంబలేరు వాగులో శవమై తేలడంతో వివాహ వేడుకలు జరగాల్సిన ఇంట్లో విషాదం చోటుచేసుకొంది.
అప్పటి నుంచి జయకుమార్(Jayakumar) కూతురి జ్ఞాపకాలను తలచుకొంటూ మనోవేదనకు గురై లోలోపల కుమిలిపోయాడు. గురువారం రాత్రి బయటకు వెళ్లిన ఆయన శుక్రవారం ఉదయం రైలు పట్టాలపై శవమై కనిపించాడు. మృతుడి వివరాలు సేకరించిన రైల్వే హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసరావు బంధువులకు సమాచారం ఇచ్చారు. నెలరోజుల వ్యవధిలోనే తండ్రి, కమార్తె మృతి చెందడంతో జయకుమార్ ఆత్మహత్యతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: దక్షిణాది రాష్ట్రాల తిరుగుబాటు తప్పదు
ఈవార్తను కూడా చదవండి: ఆధార్ లేకున్నా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం
ఈవార్తను కూడా చదవండి: స్వయం ఉపాధి పథకాలకు రుణాలివ్వండి
ఈవార్తను కూడా చదవండి: ‘కింగ్ ఫిషర్’ తయారీని పరిశీలించిన మహిళా శిక్షణ కానిస్టేబుళ్లు
Read Latest Telangana News and National News