ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chandrababu: చంద్రబాబుపై రాళ్ల దాడి ఘటనలో 2 కేసులు నమోదు

ABN, First Publish Date - 2023-04-23T15:59:26+05:30

టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)పై రాళ్ల దాడి ఘటనలో 2 కేసులు నమోదయ్యాయి. జీవో నెం 1ను ఉల్లంఘించారని మరో కేసు నమోదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)పై రాళ్ల దాడి ఘటనలో 2 కేసులు నమోదయ్యాయి. జీవో నెం 1ను ఉల్లంఘించారని మరో కేసు నమోదు చేశారు. ఎర్రగొండపాలెం (Yerragondapalem)లో చంద్రబాబు రోడ్డుపై బహిరంగ సభ నిర్వహించారని సెక్షన్ 188, 283 కింద కేసునమోదు చేశారు. రాళ్ల దాడిలో గాయపడిన టీడీపీ (TDP) కార్యకర్త హరిబాబు ఫిర్యాదుపై 324 సెక్షన్ కింద పోలీసులు కేసునమోదు చేశారు. అలాగే వైసీపీ కార్యకర్త సయ్యద్ ఇచ్చిన ఫిర్యాదుపై సెక్షన్ 143, 147, 148, 324, r/w 149 కింద కేసులు నమోదు చేశారు.

ఇరు పక్షాలపై కేసు నమోదు

కాగా శుక్రవారం రాత్రి యర్రగొండపాలెం ఘటనపై రెండు క్రిమినల్‌ కేసులు నమోదు చేశామని మార్కాపురం డీఎస్పీ కిశోర్‌కుమార్‌ తెలిపారు. ‘‘వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడులు చేశారు. మమ్మల్ని గాయపరిచారు... అని త్రిపురాంతకం మండలం ఒడ్డుపాలెం గ్రామానికి చెందిన టీడీపీ అభిమాని మన్నువ హరిబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. టీడీపీ కార్యకర్తలు వేసిన రాళ్లతో తలకు గాయమైందని జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు ఎస్‌.షాబీర్‌ ఫిర్యాదు చేశారు. రెండు కేసుల్లో రాళ్ల దాడులకు పాల్పడిన వారిని గుర్తించి అరెస్టు చేస్తాం’’ అని చెప్పారు. కాగా, ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం కోసం శుక్రవారం వైపాలెం వచ్చిన చంద్రబాబు నడిరోడ్డుపై సభ నిర్వహించిన ఘటనపై నిర్వాహకులపై పోలీసు ప్రొసీడింగ్స్‌ ప్రకారం కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

గౌరవాన్ని కోల్పోయిన మంత్రి సురేష్‌

చివరిరోజైన శుక్రవారం ఎర్రగొండపాలెం వద్ద మంత్రి సురేష్‌ (Minister Suresh) చేపట్టిన నిరసన కార్యక్రమం ఆయన ప్రతిష్టను దిగజార్చింది. చంద్రబాబుని అడ్డుకునే ప్రయత్నంతోపాటు దాడికి కూడా దిగటంతో ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. నిపుణులు కూడా మంత్రి సురేష్‌ చర్యను తప్పుబడుతున్నారు. రాజకీయంగా టీడీపీ వారు ధ్వజమెత్తడం సహజమే. కానీ సొంత పార్టీ నుంచి కూడా ఆయనపై విమర్శలు వస్తున్నాయి. సీఎం జగన్‌ (CM Jagan) వద్ద తగ్గుతున్న తన పలుకుబడిని పెంచుకునేందుకే సురేష్‌ ఈ చర్య కు పాల్పడ్డారని ఎక్కువమంది భావిస్తుండగా, అధిష్ఠానం ఆదేశాలతోనే నిరసన కార్యక్రమానికి శ్రీకారం పలికారని కొందరు భావిస్తున్నారు. బాబు కాన్వాయ్‌ వచ్చినప్పుడు పరిస్థితి ఉద్రిక్తంగా మారడానికి కార ణం కూడా కొందరు రాళ్లు విసరటమే. అయితే ఆ రాళ్లను ముందుగా మంత్రి అనుచరులు విసిరారా? వారి ని వెనకుండి నడిపిస్తున్న ఐప్యాక్‌ ప్రతినిధులు విసిరారా? అన్న అంశంలో మాత్రం కొందరికి అనుమానాలున్నాయి.

Updated Date - 2023-04-23T15:59:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising