ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP Budget Session : గవర్నర్ ప్రసంగంలో లేని మూడు రాజధానుల అంశం.. కారణం ఏంటంటే..

ABN, First Publish Date - 2023-03-14T11:42:34+05:30

ఏపీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. నేడు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. అయితే గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల అంశం లేకపోవడం గమనార్హం. ఇప్పటి వరకూ ప్రతి ప్రసంగంలోనూ మూడు రాజధానుల అంశం ఉండేంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి : ఏపీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Budget Sessions) నేటి నుంచి ప్రారంభమయ్యాయి. నేడు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ( Governor Abdul Nazir) ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. అయితే గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల అంశం లేకపోవడం గమనార్హం. ఇప్పటి వరకూ ప్రతి ప్రసంగంలోనూ మూడు రాజధానుల అంశం ఉండేంది. పరిపాలనా వికేంద్రీకరణపై ప్రస్తావన ఉండేది. నేటి వరకూ త్వరలోనే విశాఖ వెళ్తానంటూ సీఎం జగన్ (CM Jagan) చెబుతూ వస్తున్నారు. గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల అంశం లేకపోవడానికి కారణం సుప్రీంకోర్టు విచారణనేనని తెలుస్తోంది. గవర్నర్ కూడా సుదీర్ఘకాలం పాటు సుప్రీంకోర్టు (Supreme Court) న్యాయమూర్తిగా పనిచేయడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిందని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల కోసం సీఎం పాలన సాగుతోందన్నారు. సమీకృత అభివృద్ధి కోసం పారదర్శక పాలన అందిస్తున్నామని తెలిపారు. ఏపీలో నవరత్నాలతో సంక్షేమ పాలన జరుగుతోందని గవర్నర్‌ నజీర్‌ పేర్కొన్నారు. డీబీటీ ద్వారా అవినీతి లేకుండా లబ్దిధారులకే సొమ్ము అందజేస్తున్నామన్నారు. గ్రామ సచివాలయాలతో ప్రజల దగ్గరకే పాలన అందిస్తున్నామని తెలిపారు. 45 నెలల్లో 1.97 లక్షల కోట్ల నగదు ప్రజలకి చేరిందన్నారు. లబద్ధిదారుల గుర్తింపుకోసం వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చినట్లు చెప్పారు.

ఆర్థికాభివృద్ధిలో ఏపీ (Andhrapradesh) ముందడుగులో ఉందన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. 2020-21లో జీఎస్‌డీపీ వృద్ధి రేటులో ఏపీ నెంబర్‌ 1 స్థానంలో ఉందన్నారు. మొత్తంగా 11.43 శాతం అభివృద్ధి సాధించామని గవర్నర్ తెలిపారు. విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం (AP Government) కృషి చేస్తోందన్నారు. నాడు- నేడుతో స్కూళ్ల ఆధునీకరణ, మధ్యాహ్న భోజనం పథకం అమలులోకి తెచ్చామన్నారు. నాడు నేడులో 3669 కోట్లతో ఫేజ్‌ 1లో 15717 స్కూళ్ల ఆధునీకరణ చేవామని, ఫేజ్‌ 2లో 8345 కోట్లతో 22345 స్కూళ్ల ఆధునీకరణ జరిగిందన్నారు. 9,900 కోట్లతో 44 లక్ష మంది తల్లులకు అమ్మ ఒడి అందజేసినట్లు చెప్పారు. ఏటా రూ. 15 వేలు ఒక్కో లబ్ధిదారుకి అమ్మ ఒడి ద్వారా లబ్ధి పొందారన్ని గవర్నర్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

Updated Date - 2023-03-14T11:42:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising