Nara Lokesh : నారా లోకేష్‌తో భేటీ అయిన వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి
ABN, First Publish Date - 2023-06-10T12:21:43+05:30
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. బద్వేలు నియోజకవర్గం అట్లూరులో నారా లోకేష్ యువగళం పాదయాత్రకు మేకపాటి సంఘీభావం తెలిపారు. ఈ నెల 13 న ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించనుంది.
కడప : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. బద్వేలు నియోజకవర్గం అట్లూరులో నారా లోకేష్ యువగళం పాదయాత్రకు మేకపాటి సంఘీభావం తెలిపారు. ఈ నెల 13 న ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించనుంది. ఈ క్రమంలోనే లోకేష్‌తో మేకపాటి భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరుగుతోంది. బద్వేలు దేశం నేతలతో పాటు లోకేష్‌ను మేకపాటి కలిశారు.
మరోవైపు నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు చకచకా మారుతున్నాయి. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మాజీ మంత్రి అమర్నాధ్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, నేతలు వేమిరెడ్డి పట్టాభి కలిశారు. కోటంరెడ్డి నివాసంలో సుదీర్ఘ చర్చలు నిర్వహించారు. టీడీపీలోకి రావాలంటూ ఆహ్వానం పలికారు. ఇక ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని టీడీపీ ముఖ్య నేతలు కలవనున్నారు. ఆయనకు కూడా టీడీపీలోకి ఆహ్వానం పలికారు. ఈ నెల 13 నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగనుంది. ఈ క్రమంలోనే టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం పరిస్థితులు వైసీపీకి చాలా ఇబ్బందికరంగా పరిణమించాయి. అక్కడ వైసీపీ నేతలైన బాబాయ్, అబ్బాయ్ (ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, రూప్ కుమార్)ల మధ్య రోజురోజుకూ ముదురుతోంది. ఇటీవల వారిద్దరినీ కలిపేందుకు జగన్ యత్నించినా కూడా ఆ కాసేపు తలవూపి ఆ తరువాత ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఈ వర్గపోరు పార్టీకి చాలా నష్టం చేకూర్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాలో కీలక నేతలు ఆనం, కోటంరెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డిలను పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా టీడీపీని జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకు యత్నాలు సాగుతున్నాయి.
Updated Date - 2023-06-10T12:21:43+05:30 IST