ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

JAGAN: అదానీకి జగన్ వేల ఎకరాల భూమిని కట్టబెట్టే ప్రయత్నం

ABN, First Publish Date - 2023-02-11T21:26:56+05:30

వ్యవసాయం తప్ప మరొకటి తెలియని అమాయకులు అనేక ఏళ్లుగా నేలతల్లినే నమ్ముకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: వ్యవసాయం తప్ప మరొకటి తెలియని అమాయకులు అనేక ఏళ్లుగా నేలతల్లినే నమ్ముకున్నారు. కష్టమైనా.. నష్టమైనా పంటల సాగుపైనే ఆధారపడ్డారు. అనంతపురం జిల్లాలో పుడమితల్లిని నమ్ముకొని వ్యవసాయం చేసే కర్షకుల భూములను లాక్కునే ప్రయత్నం జగన్ (JAGAN) ప్రభుత్వం చేస్తోంది. సోలార్ ప్లాంట్ పేరుతో అదానీ (Adani) లాంటి బడాబాబులకు భూములను కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది.

అనంతపురం జిల్లాలో సోలార్ పవర్ ప్రాజెక్టు (Solar Power Project) పేరుతో వేల ఎకరాల భూములను అదానీ కంపెనీకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కర్ణాటకలోని పావ్‌గడ ప్రాంతంలో సోలార్ పవర్ ప్లాంట్ తరహాలోనే ఇక్కడ కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే పావ్‌గడ ప్రాంతంలో చాలా ప్రాంతాల కూలీలు బెంగళూరు నగరానికి వలస వెళ్లారు. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి వచ్చే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సోలార్ పవర్ ప్రాజెక్టు విద్యుత్ వెలుగులు రావచ్చోఏమోగానీ, రైతు జీవితంలో వెలుగులు రాలేదని మండిపడుతున్నారు.

గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (Green Energy Limited) పేరుతో అదానీ గ్రూప్ (Adani Group) అనంతపురం జిల్లాలో 18 వేల ఎకరాలు, శ్రీ సత్యసాయి జిల్లాలో మరో 25 వేల ఎకరాలు సేకరించారు. మొత్తంగా 48 వేల ఎకరాల భూమిని రైతుల నుంచి లీజు పద్ధతిలో తీసుకోనున్నారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం NREDCAPతో ఏర్పాటు చేస్తోంది. సోలార్ ఎనర్జీ రాజధానిగా అనంతపురం జిల్లా మారబోతుందని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. పంటలు పండడంలేదని కొంత ఆదాయం అయినా వస్తుందని రైతులకు మాయమాటలు చెబుతున్నారు. అమెరికాకు చెందిన హిండేబర్గ్ అదానీ అసలు రూపాన్ని బయటపెట్టడంతో ఆయనకు అప్పులు కూడా పుట్టడం లేదు. దీంతో జిల్లా రైతుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

అదానీ సోలార్‌కు భూములు ఇస్తే తమకు ఇస్తామన్న లీజు కచ్చితంగా అందుతుందా. ఎవరెందుకు గ్యారెంటీ అని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌తో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడం కోసం అనంతపురం జిల్లాలోని హీరేహాళ్, కణేకల్లు, బొమ్మనహళ్, రాయదుర్గం మండలాల్లో భూమిని గుర్తించారు. 15 వేల ఎకరాల భూమిలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఏర్పాటు చేసిన సోలార్ పవర్ ప్లాంట్ కంపెనీలన్నీ ప్రభుత్వ సాయంతో రైతుల నుంచి భూమిని కొని ఉత్పత్తి ప్రారంభించాయి. అయితే అదానీ కంపెనీ మాత్రం లీజు పద్ధతిలో రైతుల నుంచి భూమిని సేకరిస్తోంది. ఇందుకు ప్రభుత్వం సాయం చేస్తోంది. సోలార్‌కు భూములు పోవడంతో రైతు కుటుంబంతోపాటు పది మందికి ఉపాధి కరవు కానుంది.

లీజు పద్ధతిలో రైతులను మభ్యపెట్టి.. చట్టాలను తుంగలో తొక్కి వేల ఎకరాల భూములను సేకరిస్తున్నారు. ఇందుకు భూస్వామ్య, ధనిక వర్గాల మద్దతు, పాలక వర్గ పార్టీల నేతల అండ ఉండడం రైతుల ధీన పరిస్థితులు కూడా అదానీ కంపెనీలకు కలిసి వస్తున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అదానీ కంపెనీ డొల్లతనం గురించి ప్రపంచవ్యాప్త చర్చ జరుగుతుండంతో అదానీ గ్రీన్ ఎనర్జీ కోసం భూములు ఇవ్వడానికి సిద్ధమైన రైతుల్లో ఆందోళన మొదలైంది. ఎల్ఐసీ,బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల్లో అక్రమాలకు పాల్పడిన అదానీ తమకు మాత్రం లీజు మొత్తం ఇస్తాడా.. ఇవ్వకపోతే పరిస్థితి ఏంటీ అని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2023-02-11T21:27:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising