Kalava Srinivasulu: ఆ విషయంలో జగన్‌రెడ్డి సిగ్గుపడాలి
ABN, First Publish Date - 2023-08-23T19:59:33+05:30
తాగునీటి వ్యవస్థను నిర్వహించలేని దద్దమ్మ ప్రభుత్వం ఇదని.. ప్రజలకు కనీస అవసరాలను తీర్చలేని జగన్మోహన్‌రెడ్డి(Jagan Mohan Reddy) సిగ్గుపడాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు(Kalava Srinivasulu ) ఎద్దేవ చేశారు.
అనంతపురం: తాగునీటి వ్యవస్థను నిర్వహించలేని దద్దమ్మ ప్రభుత్వం ఇదని.. ప్రజలకు కనీస అవసరాలను తీర్చలేని జగన్మోహన్‌రెడ్డి(Jagan Mohan Reddy) సిగ్గుపడాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు(Kalava Srinivasulu ) ఎద్దేవ చేశారు. బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికుల మొర వినేనాథుడే లేరు.ఐదు నియోజకవర్గాలకు తాగునీటి సరఫరా నిలిచిపోతే మంత్రి, ఎమ్మెల్యేలు ఇన్‌చార్జ్ మంత్రి పట్టించుకోవడం లేదు.ఐదు రోజులుగా కార్మికుల సమ్మెతో 850 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. నియోజకవర్గానికి వచ్చే తాగునీటిని పుట్టపర్తి ఎమ్మెల్యే నిర్వీర్యం చేశారు. గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు.రాయదుర్గం నియోజకవర్గంలో 114 గ్రామాలకు తాగునీటి సమస్య ఏర్పడిందన్నారు.ఇంత చెత్తపరిపాలన ఎక్కడ లేదు... కార్మికుల వేతనాలు చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతాం’’ అని కాలవ శ్రీనివాసులు వైసీపీ ప్రభుత్వాన్ని(YCP Govt)హెచ్చరించారు
Updated Date - 2023-08-23T20:03:50+05:30 IST