అనంతలో టీడీపీ జెండాను ఎగరేద్దాం
ABN , Publish Date - Dec 16 , 2023 | 12:08 AM
రాబోవు ఎన్నికల్లో అనంతపురం అర్బన నియోజకవర్గంలో టీడీపీ జెండాను ఎగరేద్దామని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి పిలుపునిచ్చారు.
మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి
అనంతపురం అర్బన, డిసెంబరు 15: రాబోవు ఎన్నికల్లో అనంతపురం అర్బన నియోజకవర్గంలో టీడీపీ జెండాను ఎగరేద్దామని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి పిలుపునిచ్చారు. శుక్రవారం అనంతపురం అర్బన టీడీపీ కార్యాలయంలో ఆ నియోజకవర్గం పరిశీల కుడు రమణారెడ్డితో కలిసి విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిం చారు. క్లస్టర్, యూనిట్, బూత ఇనచార్జిలు సమన్వయంతో బాబు ష్యూరిటీ కార్యక్రమం నిర్వహించాలన్నారు. పార్టీలో కష్టపడే వారికే పదవులు దక్కుతాయన్నారు. త్వరలో నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటిస్తారని, ప్రజల్లోకి మరింత చొరవగా వెళ్లి గతంలో టీడీపీ చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలన్నారు. ఈనెల 20న విశాఖపట్నంలో జరిగే యువగళం ముగింపు సభకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు హాజరై జయప్రదం చేయాలన్నారు. ఈ కార్య క్రమంలో నాయకులు మారుతీకుమార్ గౌడ్, తలారి ఆదినారాయణ, దాసరి శ్రీధర్, గాజుల ఆదెన్న, సరిపూటి రమణ, సాలార్ బాషా, బంగి నాగ, మార్కెట్ మహేష్, పోతుల లక్ష్మీనరసింహులు, రాజారావు, వన్నూరు, ముక్తియార్, గోపాల్ గౌడ్, పీఎం లక్ష్మీప్రసాద్, అజీజ్, సైఫుద్దీన, గుర్రం నాగభూషణం, సుధాకర్ నాయుడు, బాలప్ప, జేఎం బాషా, పవనకుమార్, మనోహర్, తెలుగు మహిళలు స్వప్న, శివబాల, విజయశ్రీరెడ్డి, సరళ, సంగా తేజస్విని, దళవాయి రమాదేవి, శరీన, హసీనా, వసుంధర, జానకి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులు : అమరజీవి పొట్టి శ్రీరాములు వర్థంతిని పురష్కరించుకొని శుక్రవారం స్థానిక అనంతపురం అర్బన టీడీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ప్రభాకర్ చౌదరి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.