RATION: రేషన కోసం ఎదురుచూపులు..!
ABN , Publish Date - Mar 08 , 2025 | 11:56 PM
పేదలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రేషన ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇంతవరకు అందలేదని మండలంలోని తుమ్మలబైలు పెద్దతండా గ్రామస్థులు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతినెలా ఉచితంగా ఇచ్చే రేషన వేలిముద్రలు వేయించుకుని, తరువాత ఇస్తామని డీలర్లు చెప్పారని అంటున్నారు.

రెండు నెలలుగా ఇబ్బంది పడుతున్న తుమ్మలబైలు పెద్దతండా ప్రజలు
పట్టించుకోని అధికారులు
గాండ్లపెంట, మార్చి8 (ఆంధ్రజ్యోతి): పేదలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రేషన ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇంతవరకు అందలేదని మండలంలోని తుమ్మలబైలు పెద్దతండా గ్రామస్థులు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతినెలా ఉచితంగా ఇచ్చే రేషన వేలిముద్రలు వేయించుకుని, తరువాత ఇస్తామని డీలర్లు చెప్పారని అంటున్నారు. డీలర్లపై నమ్మకంతో గ్రామంలోని 180 కుటుంబాల వారు వేలిముద్రలు వేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తిన్నట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. కేంద్రం ప్రతి పేదవాడి ఇంటికి రేషన అందిచాలన్నది లక్ష్యం. అయితే తుమ్మలబైలు పెద్దతండాలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. రేషన ఎప్పుడిస్తారా అని తండావాసులు ఎదురుచూస్తున్నారు.
బియ్యం ఎప్పుడిస్తారో?: ప్రభుత్వం పంపిణీ చేసే బియ్యం ఎప్పుడోస్తాయా అని తుమ్మలబైలు పెద్దతండా వాసులు ఎదురుచేస్తున్నారు. తండాలో సర్వర్ పనిచేయడంలేదు. ఒకచోటచేరి అందిరితో వేలిముద్రలు వేయించుకుంటారు. ఫిబ్రవరి నెలలోకూడా ఈతంతు కొనసాగింది. అలాగే గతంలో లాగానే ఇంటింటికి బియ్యం ఇస్తారన్న నమ్మకంతో వేలిముద్రలు వేసినట్లు తండావాసులంటున్నారు. ఫిబ్రవరి నెలంతా రేషన ఇవ్వలేదు. మార్చిలోకూడా ఇస్తామని చెబుతున్నారేకానీ, ఇంతవరకు పంపిణీచేయలేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సక్రమంగా బియ్యం అందించాలని తండావాసులు కోరుతున్నారు.
ఆగని అవకతవకలు: తుమ్మలబైలు పెద్దతండాలో రేషన బియ్యం పంపిణీలో అవతకవలు జరుగుతున్నాయని తండావాసులు విమర్శిస్తున్నారు. గత వైసీపీ పాలనలో 2024జనవరిలో అప్పటి డీలర్ బియ్యం పంపిణీ చేయకుండా వేలిముద్రలు వేయించుకున్నారని ఏకంగా కలెక్టర్‌కే ఫిర్యాదు చేశారు. గతంలో ఆ డీలర్‌ను తొలగించి, రెవెన్యూ అధికారులో బియ్యం పంపిణీ చేశారు. ఆ తంతు ఇప్పుడుకూడా కొనసాగుతుందా అన్న సందేహాలు తండావాసులు వ్యక్తం చేస్తున్నారు. ఈయేడాది ఫిబ్రవరి, మార్చినెలల్లో ఇప్పటివరకు రేషన బియ్యం అందించకుండా వేలిముద్రలు వేయించుకుని మిన్నకుండిపోయారంటున్నారు. డీలర్ చేతివాటం ప్రదర్శించారా లేదా పక్కదారి పట్టాయా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సివిల్ సప్లై అధికారులు పట్టించుకోక పోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బియ్యం కేటాయించలేదు, శ్రీరాములు, డీలర్
స్టాక్‌పాయింట్‌నుంచి బియ్యం రాలేదు. అందుకే కార్డుదారులకు బియ్యం అందించలేదు.
విచారణ చేపడతాం: వాణీ, సీఎ్‌సడీటీ, గాండ్లపెంట
ప్రభుత్వం అందిస్తున్న చౌకబియ్యం ప్రతినెలా లబ్దిదారులకు అందించాలి. వేలిముద్రలు వేయించుకుని బియ్యం ఇవ్వలేదన్న విషయం తన దృష్టికి రాలేదు. తండాలో విచారణ చేసి లబ్ధిదారులకు న్యాయం చేస్తాం.
బియ్యం ఇస్తామంటున్నారు
రేషన బియ్యం గతనెలలో వేలిముద్రలు వేయించుకున్నారు. ఈనెలలో మరోమారు వేలిముద్రలు వేయించుకుని, రెండూ ఒకేసారి ఇస్తామని చెబుతున్నారు. తమకు ప్రతినెలా బియ్యం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.