Chandrababu Case: చంద్రబాబుపై కేసుకు సంబంధించి ఎస్పీ గంగాధరరావు వివరణ
ABN, First Publish Date - 2023-08-09T13:12:31+05:30
చిత్తూరు జిల్లా అంగళ్లులో జరిగిన ఘటనకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏ1 గా కేసు నమోదు చేయడంపై జిల్లా ఎస్పీ గంగాధరరావు వివరణ ఇచ్చారు.
అన్నమయ్య: చిత్తూరు జిల్లా అంగళ్లులో జరిగిన ఘటనకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబుపై (TDP Chief Chandrababu naidu) ఏ1 గా కేసు నమోదు చేయడంపై జిల్లా ఎస్పీ గంగాధరరావు (SP Gangadhar rao) వివరణ ఇచ్చారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పర్యటనలో ఈనెల 4న అంగళ్ళు దగ్గర జరిగిన సంఘటనకు సంబంధించి బాధితులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. షెడ్యూల్‌లో అప్పటికప్పుడు చంద్రబాబు ప్రొగ్రామ్‌లో మార్పులు చేశారని తెలిపారు. చంద్రబాబు మార్చుకున్న ప్లాన్‌కు అనుమతి లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యేను కించపరిచే విధంగా మాజీ సీఎం వ్యాఖ్యలు చేశారన్నారు. 4న స్థానిక వైసీపీ కార్యకర్తలు, ఉమాపతి రెడ్జి ఆధ్వర్యంలో చంద్రబాబుకు మెమొరాండం ఇవ్వడానికి అక్కడికి వచ్చారని చెప్పారు. దాడి చేయాటానికి ముందుగానే టీడీపీ కార్యకర్తలు ప్రణాళిక చేసుకున్నారని తెలిపారు. ఉమాపతి రెడ్డి నిన్న (మంగళవారం) 7 గంటలకు ఫిర్యాదు చేశారని.. దానిపై కేసు నమోదు చేశామన్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు పర్యటన దాడులకు సంబంధించి 6 కేసులు నమోదయ్యాయని అన్నారు. అయితే ఇప్పటి వరకు ఎవరినీ కూడా ఇంకా అరెస్ట్ చేయలేదని ఎస్పీ వెల్లడించారు.
ఎవరిపై ఏఏ కేసులు పెట్టారంటే..
తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో ఇటీవల జరిగిన ఘర్షణ ఘటనలపై కేసులు నమోదు అయ్యాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఏ వన్ ముద్దాయిగా కేసు నమోదు చేశారు. చంద్రబాబుపై హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు అయ్యింది. ముదివీడు పోలీస్ స్టేషన్‌లో చంద్రబాబు సహా 20 మందికి పైగా టీడీపీ నేతలపై కేసులు నమోదు అయ్యాయి. ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమ, ఏ3గా అమర్నాథ్‌రెడ్డి, ఏ4గా ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి సహా నల్లారి కిషోర్, దమ్మాలపాటి రమేష్, గంటా నరహరి, శ్రీరాంచిన బాబు, పులవర్తి నాని, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తదితరులపై కేసు నమోదు అయ్యింది. 20 మందితో పాటు ఇతరులంటూ మరికొందరు టీడీపీ నేతలపై కూడా కేసులు నమోదు అయ్యాయి. ఉమాపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 4న మారణాయుధాలు, ఐరన్ రాడ్లు, ఇటుకలు, కర్రలతో టీడీపీ వారు వచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మారణాయుధాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారంటూ ఫిర్యాదు నమోదు అయ్యింది.
Updated Date - 2023-08-09T13:12:31+05:30 IST