CM Jagan: జగన్ సర్కార్కు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ

ABN , First Publish Date - 2023-03-15T17:24:25+05:30 IST

జగన్ (Jagan) సర్కార్కు మరో సారి హైకోర్టు (High Court)లో ఎదురుదెబ్బ తగిలింది. ఉద్యోగుల సమస్యలపై ఏపీ ప్రభుత్వం నిర్వహించే సమావేశాలకు ప్రభుత్వ ఉద్యోగ సంఘాన్ని

CM Jagan: జగన్ సర్కార్కు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ

అమరావతి: జగన్ (Jagan) సర్కార్కు మరో సారి హైకోర్టు (High Court)లో ఎదురుదెబ్బ తగిలింది. ఉద్యోగుల సమస్యలపై ఏపీ ప్రభుత్వం నిర్వహించే సమావేశాలకు ప్రభుత్వ ఉద్యోగ సంఘాన్ని ఆహ్వానించాలని హైకోర్టు ఆదేశించింది. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం నిర్వహించే సమావేశాలకు ఆహ్వానించకపోవడంపై జీఈఏ అధ్యక్షుడు సూర్యనారాయణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈనెల 7న ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ అధికారికం కాదంటూ ప్రభుత్వ తరపు న్యాయవ్యాది కోర్టుకు దృష్టికి తెచ్చారు. అయితే వాదనలు విన్న న్యాయస్థానం ప్రభుత్వ లాయర్ వాదనలను తోచిపుచ్చింది. హైకోర్టు ఉత్తర్వులపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలపై ఏపీ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఉద్యోగుల ఒత్తిడి నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ సంఘాలతో భేటీ అవుతోంది. ఈ సమావేశాల్లో అమరావతి జేఏసీ నేతలు కీలకంగా వ్యవహరిస్తున్నారు.

జీతాలు సకాలంలో అందక, డీఏ బకాయిలు, వైద్య ఖర్చుల బిల్లుల తిరిగి చెల్లింపు, ఏపీజీఎల్‌ఐ, పీఎఫ్‌ బకాయిలు తదితర చిరకాల డిమాండ్లలో ఏ ఒక్కటీ పరిష్కారమయ్యే అవకాశాలు కనుచూపుమేరలో కనబడని నేపథ్యంలో ఉద్యోగులు ఉద్యమబాటకు సిద్దమయ్యారు. ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంతో జీతాలు, పెన్షన్లు సకాలంలో చెల్లించకపోవడంతో ఉద్యోగులు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరపాలని నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశానికి మంత్రులతో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy), ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు(Bopparaju Venkateswarlu), సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డి, ఏపీ ఎన్జీవోల సంఘం నుంచి బండి శ్రీనివాసరావును ఆహ్వానించారు. అయితే ప్రభుత్వ జీఈఏ అధ్యక్షుడు సూర్యనారాయణను ఆహ్వానించలేదు. దీంతో సూర్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు.

Updated Date - 2023-03-15T17:50:32+05:30 IST