AP TDP Chief: చంద్రబాబు భద్రతపై అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-10-27T13:38:12+05:30
టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతపై ఆ పార్టీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో అచ్చెన్న మాట్లాడుతూ.. జైల్లో వ్యక్తులను చంపేయడంలో జగన్ అండ్ టీం ఎక్సపర్ట్స్ అన్నారు. జైల్లో ఉన్న వాళ్లని సైలెంటుగా చంపేస్తారని.. గతంలో అలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు. జైల్లో జరుగుతున్న పరిణామాలు.. చంద్రబాబు భద్రత విషయంలో ప్రభుత్వ వైఖరితో తమలో ఆందోళన కలుగుతోందని అన్నారు.
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) భద్రతపై ఆ పార్టీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు (AP TDP Chief Atchannaidu) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో అచ్చెన్న మాట్లాడుతూ.. జైల్లో వ్యక్తులను చంపేయడంలో జగన్ అండ్ టీం ఎక్స్పర్ట్స్ అన్నారు. జైల్లో ఉన్న వాళ్లని సైలెంటుగా చంపేస్తారని.. గతంలో అలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు. జైల్లో జరుగుతున్న పరిణామాలు.. చంద్రబాబు భద్రత విషయంలో ప్రభుత్వ వైఖరితో తమలో ఆందోళన కలుగుతోందని అన్నారు. జైలుపై డ్రోన్లు ఎగరేస్తున్నా.. విచారణ లేదన్నారు. చంద్రబాబును అంతం చేసేందుకు కోట్లాది రూపాయలు చేతులు మారాయనే లేఖలు వచ్చినా విచారణ జరపడం లేదని మండిపడ్డారు. జైల్ లోపల నుంచి ఫొటోలు వస్తున్నా ఎలాంటి చర్యల్లేవన్నారు. చంద్రబాబు జుడిషియల్ కస్టడీలో ఉంటే ప్రభుత్వానికేం సంబంధమని ప్రశ్నించారు. సజ్జల డైరెక్షన్లో మొత్తం వ్యవహారం నడుస్తుండడం కూడా తమకు మరింత ఆందోళన కలుగుతోందన్నారు. గోరంట్ల మాధవ్ వంటి వారి మాటలతో ప్రభుత్వ ఉద్దేశ్యాలు బయట పడుతున్నాయన్నారు. చంద్రబాబు చాలా వరకు బరువు తగ్గారని తెలిపారు. స్కిల్ సెంటర్లు లేవని గతంలో మంత్రులు కామెంట్లు చేశారని.. స్కిల్ సెంటర్లు ఉన్నాయని కేసు పెట్టిన అజయ్ రెడ్డి ఇప్పుడు స్వయంగా చెప్పారని అచ్చెన్నాయుడు వెల్లడించారు.
Updated Date - 2023-10-27T13:38:12+05:30 IST