ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Atchannaidu: దెబ్బమీద దెబ్బతో దిక్కుతోచని స్థితిలో వైసీపీ

ABN, First Publish Date - 2023-11-22T12:47:59+05:30

Andhrapradesh: దెబ్బమీద దెబ్బతో దిక్కుతోచని స్థితిలో వైసీపీ ఉందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు.

అమరావతి: దెబ్బమీద దెబ్బతో వైసీపీ (YCP) దిక్కుతోచని స్థితిలో ఉందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు (AP TDP Chief Atchannaidu) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడారు. టీడీపీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంతో వైసీపీ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారిందని అన్నారు. రోజూ స్వచ్ఛందంగా లక్షలాది మంది భవిష్యత్ గ్యారెంటీ రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారని అన్నారు. చంద్రబాబుకు (TDP Chief Chandrababu Naidu) బెయిల్ మంజూరు కావడంపై జగన్ రెడ్డి (AP CM Jagan Reddy), వైసీపీ గ్యాంగ్ అసహనంలో ఉన్నారని పేర్కొన్నారు.

అసహనంతో ఏం మాట్లాడుతున్నారో తెలియని స్థితికి బులుగు బ్యాచ్ చేరిందని అచ్చెన్నాయుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గడపగడప ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లిన వైసీపీ నేతలను ప్రజలు తరిమి తరిమి కొట్టారని అన్నారు. టీడీపీ భవిష్యత్తుకు గ్యారెంటీకి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని, ఆ అసహనంతో జగన్ ముఠా పిచ్చిపట్టినట్లు వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. భవిష్యత్తులో అందించే పథకాల గురించి చెబుతుంటే ఎందుకంత అసహనం అని వైసీపీ నేతలను ఆయన ప్రశ్నించారు.


ఆడబిడ్డకు నెలకు రూ.1500 ఇస్తామంటే వైసీపీకి ఎందుకంత కోపమని ప్రశ్నించారు. చదువుకునే ప్రతి బిడ్డకు రూ.15వేలు ఇస్తామంటే ఎందుకంత అసహనమని, ఏటా 3 సిలిండర్ల హామీపై ఎందుకంత కడుపు మంట అని అన్నారు. అన్నదాతకు రూ.20 వేలు ఇస్తామంటే ఎందుకంత అక్కసు అంటూ విరుచుకుపడ్డారు. బీసీలకు రక్షణ చట్టం తెస్తామంటే బరితెగింపు మాటలేల? అని అన్నారు. ఇంకెన్నాళ్లీ తప్పుడు ప్రచారాలతో కాలం నెట్టుకొస్తారని ప్రశ్నిస్తూ.. జగన్ రెడ్డిలా ప్రజల వ్యక్తిగత డేటా టీడీపీ సేకరించడం లేదని తెలిపారు. వాలంటీర్లతో వివాహేతర సంబంధాల గురించి ఆరా తీసిందెవరని నిలదీశారు. సమాచారాన్నంతా రామ్ ఇన్ఫోటెక్ కంపెనీకి దోచిపెట్టిందెవరని అడిగారు. 2024 ఎన్నికల తర్వాత వైసీపీని బంగాళాఖాతంలో కలిపేయడం తథ్యమని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

Updated Date - 2023-11-22T13:05:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising