Kanaka durga temple: సోషల్ మీడియాలో దుర్గమ్మ అంతరాలయం వీడియోలు

ABN , First Publish Date - 2023-01-03T17:16:59+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధమైన బెజవాడ దుర్గమ్మ (Bezawada Kanaka durga) అంతరాలయం వీడియోలు (Viedo) సోషల్‌ మీడియాలో (Social Media) చక్కర్లుకొడుతున్నాయి. అమ్మవారి మూలవిరాట్‌ను ఎవరో వ్యక్తులు వీడియో తీసి పోస్టులు పెట్టారు.

Kanaka durga temple: సోషల్ మీడియాలో దుర్గమ్మ అంతరాలయం వీడియోలు

విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధమైన బెజవాడ దుర్గమ్మ (Bezawada Kanaka durga) అంతరాలయం వీడియోలు (Viedo) సోషల్‌ మీడియాలో (Social Media) చక్కర్లుకొడుతున్నాయి. అమ్మవారి మూలవిరాట్‌ను ఎవరో వ్యక్తులు వీడియో తీసి పోస్టులు పెట్టారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కనకదుర్గ టెంపుల్‌ ఐటీలో ఈ దృశ్యాలు కనిపించాయి. ఆలయ ఆవరణతోపాటు అంతరాలయంలోని అమ్మవారి వీడియోలు వెలుగు చూశాయి. సిబ్బంది సహకారంతోనే ఇదంతా జరిగివుండొచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై దుర్గగుడి ఈవో భ్రమరాంబ స్పందించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. సీసీ కెమెరాలు పరిశీలించి వాస్తవాలు తెలుసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

కాగా అమ్మవారి వీడియోలు సోషల్‌ మీడియాలో పెట్టడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రత ఉన్నప్పటికీ ఇలా జరగడంపై మండిపడుతున్నారు. ఈ చర్యకు పాల్పడినవారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా పకడ్బందీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Updated Date - 2023-01-03T19:21:26+05:30 IST