ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Polavaramపై మరో బాంబు పేల్చిన కేంద్రం

ABN, First Publish Date - 2023-02-02T13:45:04+05:30

పోలవరంపై కేంద్రం మరో బాంబు పేల్చింది. నిర్వాసిత కుటుంబాలకు పరిహారాన్ని నేరుగా నగదు బదిలీ చేయడం కుదరదని కేంద్రం తేల్చి చెప్పింది. పోలవరం నిర్మాణ బాధ్యతలు రాష్ట్రమే చేపడుతున్నందు వల్ల కేంద్రం నగదు బదిలీ చేయడం కుదరదని స్పష్టం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Delhi : పోలవరం (Polavaram)పై కేంద్రం (Central Government) మరో బాంబు పేల్చింది. నిర్వాసిత కుటుంబాలకు పరిహారాన్ని నేరుగా నగదు బదిలీ చేయడం కుదరదని కేంద్రం తేల్చి చెప్పింది. పోలవరం నిర్మాణ బాధ్యతలు రాష్ట్రమే (AP State) చేపడుతున్నందు వల్ల కేంద్రం నగదు బదిలీ చేయడం కుదరదని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ (AP Government) విజ్ణప్తి లేదని తెలిపింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం చేసిన ఖర్చును ఎప్పటికప్పుడు తిరిగి చెల్లిస్తున్నామని కేంద్రం తేల్చి చెప్పింది. లోక్‌సభ (Loksabha)లో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ (Gajendra Singh Shekawath) రాతపూర్వక సమాధానం ఇచ్చారు.

భూసేకరణ సహాయ పునరావాస ప్యాకేజీ కింద ఆంధ్రప్రదేశ్ (Andhara Pradesh) ప్రభుత్వం చేసిన ఖర్చులను తిరిగి చెల్లించడంలో ఎలాంటి జాప్యం లేదని కేంద్రం స్పష్టం చేసింది. భూసేకరణ కింద 2014 ఏప్రిల్ నుంచి 2022 డిసెంబర్ వరకూ రూ. 3779.5 కోట్లు బిల్లులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించగా రూ. 3431.59 కోట్లు తిరిగి చెల్లించామని గణాంకాలతో సహా కేంద్రం వివరించింది. సహాయ పునరావస ప్యాకేజీ కింద 2014 ఏప్రిల్ నుంచి 2022 డిసెంబరు వరకూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2267.29 కోట్లకు బిల్లులు సమర్పించగా ఇప్పటివరకు రూ. 2110.23 కోట్లు తిరిగి చెల్లించడం జరిగిందని స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చేస్తున్నందున పోలవరం ప్రాజెక్టు కింద ముంపు బాధిత కుటుంబాలకు నేరుగా కేంద్ర ప్రభుత్వం నగదు బదిలీ చేయడం సాధ్యం కాదని లేఖలో షేకావత్ స్పష్టం చేశారు.

Updated Date - 2023-02-02T13:50:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising