ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Devineni: చంద్రబాబును సీసీ కెమెరాల్లో చూస్తూ జగన్ సైకో ఆనందం పొందుతున్నారు

ABN, First Publish Date - 2023-09-21T20:03:19+05:30

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అక్రమ కేసులో అరెస్టు చేసి రెండు వారాలుగా ఇబ్బందులు పెడుతూ సీఎం జగన్, వైసీపీ నేతలు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు.

తిరువూరు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును (Chandrababu Naidu) అక్రమ కేసులో అరెస్టు చేసి రెండు వారాలుగా ఇబ్బందులు పెడుతూ సీఎం జగన్, వైసీపీ నేతలు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) విమర్శలు గుప్పించారు.


"సి ఓటర్ సర్వేలు టీడీపీకి అనుకూలంగా రావటంతో జగన్‌కు జ్వరం పట్టుకొంది. విభిన్న పార్టీలు, వివిధ రాష్ట్రాల నేతలు చంద్రబాబుకు మద్దతు తెలపటంతో వైసీపీ నేతల్లో వణుకు పుట్టింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఒక రిమాండ్ ఖైదీ మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. అర్ధరాత్రి కరెంట్ తీస్తున్నారు. 73 సంవత్సరాల వయస్సులో చంద్రబాబునాయుడుని ఇబ్బంది పెడుతున్నారు. జైల్లో చంద్రబాబు ఏం చేస్తున్నారని రోజూ తాడేపల్లి కొంప నుంచి జగన్ జైలు సీసీ టీవీ కెమెరాల్లో చూస్తూ సైకో ఆనందం పొందుతున్నారు. తెలుగు జాతి 14 కోట్ల మంది ప్రజలు ఒక సైకో సీఎం చేతిలో నాశనం అవుతుందని, దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారు, ప్రముఖులు మాట్లాడుకొంటున్నారు. దేశంలో అతి తక్కువ ఖర్చుతో ఫైబర్ గ్రిడ్ ద్వారా కరెంట్ పోల్స్ కి వైర్లు వేసి అతి తక్కువ ఖర్చుతో ఇంటి ఇంటికి టీవీ, ఇంటర్నెట్ ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిది అయితే.. ఫైబర్ గ్రిడ్ పై మరో కేసు పెట్టి ఇరికించాలని జగన్ రెడ్డి ప్రభుత్వం కుటిల ప్రయత్నం చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది, చంద్రబాబునాయుడు త్వరలోనే బయటకు వస్తారు.


చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా తిరువూరు నియోజకవర్గ పరిధిలో రిలే నిరాహారదీక్షలు 9వ రోజుకు చేరాయి. SC సెల్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షకు టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంఘీభావం తెలిపారు. దీక్ష చేస్తున్న నేతలకు దేవినేని ఉమ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం టీడీపీ నియోజకవర్గ కార్యాలయం నుంచి బాబుకు మేము సైతం అంటూ మద్దతుగా దేవినేని ఉమామహేశ్వరరావు, ఇన్‌ఛార్జ్ శావల దేవదత్, నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.

Updated Date - 2023-09-21T20:06:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising