AP POLICE: పుంగనూరు అల్లర్లలో 62మంది అరెస్టు
ABN, First Publish Date - 2023-08-06T23:02:11+05:30
జిల్లాలోని పుంగనూరు(Punganur)లో ఈ నెల 4వ తేదీన తెలుగుదేశం(Telugu Desham) అధినేత , మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) పర్యటించారు.
చిత్తూరు(Chittoor): జిల్లాలోని పుంగనూరు(Punganur)లో ఈ నెల 4వ తేదీన తెలుగుదేశం(Telugu Desham) అధినేత , మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) పర్యటించారు. చంద్రబాబు పర్యటనలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Minister Peddireddy Ramachandra Reddy) అనుచరులు, టీడీపీ శ్రేణులు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పలువురు గాయపడ్డారు. వీరిలో పోలీసులకు కూడా గాయలయ్యాయి. ఈ అల్లర్లకు కారణమైన టీడీపీ నేతలను అరెస్టు చేసినట్లు పుంగనూరు SEB ఏఎస్పీ శ్రీలక్ష్మి(SEB ASP Srilakshmi) తెలపారు. ఆదివారం రాత్రి ఏఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు.అల్లర్లలో టీడీపీకి చెందిన 62మందిని గుర్తించి అరెస్టు చేశామని చెప్పారు. A1 ముద్దాయిగా టీడీపీ ఇన్‌చార్జ్ చల్లాబాబు(Challa Babu)పై కేసు నమోదు చేశామని అన్నారు.పోలీసులతో టీడీపీ శ్రేణులు ఘర్షణ పడి గాయపరిచారన్నారు.అల్లర్లు జరగడానికి ముందే 2వ తేదీన టీడీపీ శ్రేణులతో టీడీపీ ఇన్‌చార్జ్ చల్లా బాబు సమావేశం నిర్వహించారని తెలిపారు. ఈ సమావేశంలో పోలీసులతో ఏ విధంగా ఉండాలి, పోలీసులను రెచ్చగొడితే లాఠీ దెబ్బలు, కాల్పులు జరుపుతారని, అందులో ఒకరు మరణిస్తే ఏపీ వ్యాప్తంగా అలజడి సృష్టించాలనేదే ప్రధాన ఉద్దేశ్యం అని చెప్పారు. చల్లాబాబు పీఏ ఇఛ్చిన సమాచారం మేరకు కేసులు నమోదు చేసినట్లు ఏఎస్సీ శ్రీలక్ష్మి తెలిపారు. పుంగనూరు అల్లర్లకు కారణమైన వారిని ఈ రోజు వరకు గుర్తించి అరెస్ట్ చేశామరని చెప్పారు. విచారణలో, దర్యాప్తులో ఇంకెవరైన ఈ అల్లర్లకు కారణమని తేలితే వారిని కూడా అరెస్ట్ చేస్తామని ఏఎస్పీ శ్రీలక్ష్మి తెలిపారు.
Updated Date - 2023-08-06T23:02:25+05:30 IST