ABN Exclusive : లోకేశ్ గురించి మాట్లాడుతూ భువనేశ్వరి తీవ్ర భావోద్వేగం
ABN, First Publish Date - 2023-08-29T13:24:22+05:30
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో దూసుకుపోతున్నారు. లోకేశ్ పాదయాత్రకు ప్రజాదరణ ఎంతగానో లభిస్తోంది. ప్రభుత్వం నుంచి ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ అన్నింటినీ అధిగమిస్తూ లోకేశ్ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలో లోకేశ్ పాదయాత్రపై తల్లి భువనేశ్వరి తొలిసారి స్పందించారు. ఈ క్రమంలో భువనేశ్వరి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం కుప్పంలో పర్యటించిన చంద్రబాబు సతీమణి... ఏబీఎన్ - ఆంధ్రజ్యోతికి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు.
చిత్తూరు: టీడీపీ యువనేత నారా లోకేశ్(TDP Leader Nara lokesh) యువగళం పాదయాత్రలో (YuvaGalam Padayatra)దూసుకుపోతున్నారు. లోకేశ్ పాదయాత్రకు ప్రజాదరణ ఎంతగానో లభిస్తోంది. ప్రభుత్వం నుంచి ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ అన్నింటినీ అధిగమిస్తూ లోకేశ్ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలో లోకేశ్ పాదయాత్రపై తల్లి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) తొలిసారి స్పందించారు. ఈ క్రమంలో భువనేశ్వరి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం కుప్పంలో పర్యటించిన చంద్రబాబు సతీమణి... ఏబీఎన్ - ఆంధ్రజ్యోతికి (ABN- Andhrajyothy) ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. లోకేశ్ పాదయాత్ర నిర్వహించాలని భావించినప్పుడు ముందు ఆవేదనకు, ఆందోళనకు గురయ్యానని చెప్పుకొచ్చారు. తొలత పాదయాత్ర చేస్తుంటే తన కళ్ళ నుంచి నీళ్లు ఆపుకోలేకపోయానని తెలిపారు. లోకేశ్ తనకు ధైర్యం చెప్పిన తర్వాత తనలో మనోధైర్యం వచ్చిందన్నారు. ప్రస్తుతం పాదయాత్రలో లోకేశ్ రాటు తేలిపోయారని ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రజల కోసం లోకేశ్ పాదయాత్ర పూర్తి చేసి తీరతారన్నారు. పాదయాత్రలోనే కాదు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ కుటుంబంపై ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రజల కోసం తమ కుటుంబం ప్రాణాలు వడ్డీ పోరాడుతోందన్నారు. ఈ పోరాటం ఇలాగే కొనసాగిస్తామని, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ (TDP) అధికారంలోకి వస్తుందని నారా భువనేశ్వరి ధీమా వ్యక్తం చేశారు.
అక్కకు కృతజ్ఞతలు...
అలాగే.. స్వర్గీయ ఎన్టీఆర్ స్మారక నాణెం (NTR commemorative coin) విడుదల అవడం పట్ల భువనేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. తండ్రి ఎన్టీఆర్ పేరు మీద వంద రూపాయల నాణెం విడుదల విషయంలో అక్క పురందేశ్వరికి (AP BJP Chief Daggubati Purandeshwari) ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. తన తండ్రి పేరుపై నాణెం విడుదల గర్వంగా ఉందన్నారు. ఇలాంటి అనేక కార్యక్రమాలు తన తండ్రి పేరుపైన కొనసాగాలని భువనేశ్వరి ఆకాంక్షించారు.
కుప్పం పర్యటన ఇలా...
ఈరోజు (మంగళవారం) ఉదయం కుప్పం చేరుకున్న నారా భువనేశ్వరికి టీడీపీ నేతలు, కార్యకర్తలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. అనంతరం కుప్పం గంగమ్మ గుడి ఆలయంలో ప్రత్యేక పూజలో భువనేశ్వరి పాల్గొన్నారు. ఆపై ప్యాలెస్ రోడ్‌లో సంజీవని వైద్యశాల, మొబైల్ క్లినిక్‌ను ప్రారంభించారు. అక్కడి నుంచి శాంతిపురం మండలం కడపల్లి సమీపంలో నిర్మాణంలో ఉన్న సొంత ఇంటిని భువనేశ్వరి పరిశీలించనున్నారు.
Updated Date - 2023-08-29T13:51:10+05:30 IST