ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TTD : ఈ నెల 22 నుంచి వైకుంఠ ద్వార దర్శనం ఉచిత టోకెన్లు

ABN, Publish Date - Dec 21 , 2023 | 09:41 PM

వైకుంఠ ఏకాదశి ( Vaikuntha Ekadashi ) ని పురష్కరించుకుని డిసెంబ‌రు 22వ తేదీ నుంచి తిరుపతిలో 9 ప్రాంతాల్లోని కౌంట‌ర్లలో వైకుంఠ ద్వార దర్శనం ఉచిత టోకెన్ల జారీకి టీటీడీ ( TTD ) ఏర్పాట్లు చేసింది. డిసెంబ‌రు 23వ తేదీ నుంచి జ‌న‌వ‌రి 1వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించనున్నారు.

తిరుపతి: వైకుంఠ ఏకాదశి ( Vaikuntha Ekadashi ) ని పురష్కరించుకుని డిసెంబ‌రు 22వ తేదీ నుంచి తిరుపతిలో 9 ప్రాంతాల్లోని కౌంట‌ర్లలో వైకుంఠ ద్వార దర్శనం ఉచిత టోకెన్ల జారీకి టీటీడీ ( TTD ) ఏర్పాట్లు చేసింది. డిసెంబ‌రు 23వ తేదీ నుంచి జ‌న‌వ‌రి 1వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించనున్నారు. ఇందుకు సంబంధించిన ఉచిత దర్శనాల టోకెన్లను డిసెంబ‌రు 22వ తేదీ మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి తిరుప‌తిలోని 9 ప్రాంతాల్లో 90 కౌంట‌ర్ల ద్వారా టోకన్లు పూర్తిగా అయిపోయే వరకు కేటాయించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. రేపు టోకెన్లు ఇస్తామని టీటీడీ ప్రకటించినా ఇప్పుడే టికెట్ కేంద్రాల వద్దకు వందలాదిమంది భక్తులు చేరుకున్నారు. ఈ రోజు టోకెన్లు జారీ లేదని, రేపు ఉదయమే టోకన్లు జారీ చేయనున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. రేపటి నుంచి తిరుపతిలో దర్శనం టోకెన్లను టీటీడీ అధికారులు జారీ చేయనున్నారు. కాగా.. 24 గంటల ముందే తిరుమలకు ప్రవేశం కల్పించనున్నది. టోకన్లు పొందిన వారిని, దర్శనం పొందిన తేదీ, సమయం నుంచి 24 గంటల ముందు మాత్రమే తిరుమలకు టీటీడీ అనుమతించనుంది.

టికెట్లు ఇచ్చేది ఈ కేంద్రాల్లోనే..

1. విష్ణునివాసం,

2. శ్రీ‌నివాసం,

3. గోవింద‌రాజ‌స్వామి స‌త్రాలు,

4. భూదేవి కాంప్లెక్స్‌,

5. రామచంద్ర పుష్కరిణి

6. ఇందిరా మైదానం,

7. జీవ‌కోన హైస్కూల్‌,

8. బైరాగిప‌ట్టెడ‌లోని రామానాయుడు హైస్కూల్‌,

9. ఎంఆర్ ప‌ల్లిలోని జడ్‌పి హైస్కూల్‌

ఈ కౌంటర్లలో నాలుగు లక్షలకు పైగా టోకెన్లను అవి అయిపోయే వరకు కంటిన్యూగా ఇచ్చేస్తామని టీటీడీ అధికారులు తెలిపారు.

Updated Date - Dec 21 , 2023 | 11:29 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising