వైభవంగా పాలేటమ్మ ఆలయ మహా కుంభాభిషేకం

ABN , First Publish Date - 2023-03-17T01:04:55+05:30 IST

గార్గేయ నదీతీరాన వెలసిన పాలేటమ్మ ఆలయ మహా కుంభాభిషేక పూజలను గురువారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన యాగశాలలో అత్యంత వైభవంగా నిర్వహించారు.

వైభవంగా పాలేటమ్మ ఆలయ మహా కుంభాభిషేకం
హోమం నిర్వహిస్తున్న అర్చకులు

ఐరాల, మార్చి 16: గార్గేయ నదీతీరాన వెలసిన పాలేటమ్మ ఆలయ మహా కుంభాభిషేక పూజలను గురువారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన యాగశాలలో అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద మంత్ర ఘోష నడుమ పూజలు, హోమాలను అర్చకులు నిర్వహించారు. శుక్రవారం వేకువ జామున 2 గంటలకు ఆలయంలో పాలేటమ్మ నూతన రాతి విగ్ర హానికి ప్రాణప్రతిష్ఠ నిర్వహించి, ఉదయం 9 గంటల నుంచి 10 గంటల్లోపు ఆలయ మహా కుంభాభిషేకాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ఎం.కె.బాలాజి, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-17T01:04:55+05:30 IST