ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nannapaneni Rajakumari : చంద్రబాబు అక్రమ అరెస్టుతో జగన్‌రెడ్డి దారుణాలు పక్కదారి పట్టాయి

ABN, First Publish Date - 2023-10-27T17:06:58+05:30

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu ) అక్రమ అరెస్టుతో ముఖ్యమంత్రి జగన్మో‌హన్‌రెడ్డి దారుణాలు అన్నీ పక్కదారి పట్టాయని ఆ పార్టీ సీనియర్ నాయకురాలు నన్నపనేని రాజకుమారి ( Nannapaneni Rajakumari ) అన్నారు.

తిరుపతి: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu ) అక్రమ అరెస్టుతో ముఖ్యమంత్రి జగన్మో‌హన్‌రెడ్డి దారుణాలు అన్నీ పక్కదారి పట్టాయని ఆ పార్టీ సీనియర్ నాయకురాలు నన్నపనేని రాజకుమారి ( Nannapaneni Rajakumari ) అన్నారు. శుక్రవారం నాడు తిరుపతి‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ...‘‘పదవి శాశ్వతం కాదు. పరపతి, ప్రజల హృదయాల్లో స్థానం శాశ్వతం. చంద్రబాబు మొక్కలు నాటితే, ఈ ముఖ్యమంత్రి పర్యటనకు వస్తే.. చెట్లు కొట్టేస్తున్నారు. అలిపిరిలో క్లైమోర్‌మైన్ దాడి నుంచి చంద్రబాబు బయటపడటం దైవ నిర్ణయం. ఈ రోజు దయ్యాల నిర్ణయం వల్ల చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైళ్లో బంధీగా ఉన్నారు. చంద్రబాబుకే రక్షణ లేనప్పుడు సామాన్యులకు రక్షణ ఉంటుందా..? చంద్రబాబు అక్రమ అరెస్టుతో వివేకానందరెడ్డి హత్యకేసులో అవినాశ్‌రెడ్డి అరెస్టు విషయం, కోడికత్తి కేసు విషయం, అక్రమాలు అన్నీ పక్కకు పోయాయి. దుర్మార్గుల దౌర్జన్యం కన్నా, మేధావుల మౌనం ప్రమాదకరం అని నెపోలియన్ అన్న మాటలు ఏపీ ప్రజలకు గుర్తు చేస్తున్నాను. అ ధర్మాన్ని ఎక్కడ సహించినా, ధర్మం ప్రమాదంలో పడింది’’ అని నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు.

Updated Date - 2023-10-27T17:07:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising