ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YuvaGalam: లోకేష్ పాదయాత్రకు బ్రహ్మరథం... ఎంతో ఉత్సాహంతో ముందుకెళ్తున్న యువనేత

ABN, First Publish Date - 2023-02-14T12:09:47+05:30

చిత్తూరు జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: చిత్తూరు జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మంగళవారం ఉదయం నారాయణవనం మండలం వెత్తలతడుకు నుంచి యువనేత 19వ రోజు పాదయాత్ర (NaraLokesh)ను మొదలుపెట్టారు. ఎంతో ఉత్సాహంతో లోకేష్ (Lokesh YuvaGalama)పాదయాత్రలో ముందుకు వెళ్తున్నారు. పెద్దఎత్తున టీడీపీ అభిమానులు (TDP Fans), స్థానికులు లోకేష్ పాదయాత్ర (YuvaGalam)లో తరలివెళ్తున్నారు. లోకేష్ (NaraLokesh YuvaGalam Padayatra) ప్రసంగాలకు ప్రజల నుంచి చక్కని ఆదరణ లభిస్తుండటంతో టీడీపీ నేతల్లో (TDP Leaders) హుషారు కనిపిస్తోంది.

పాదయాత్రలో భాగంగా వెదురు కళాకారులతో లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు. గోవిందప్పకండ్రిగలో స్థానికులతో మాటామంతిలో పాల్గొన్నారు. ఆ తరువాత అరణ్యకండ్రిగలో దాసరి, పద్మశాలి సామాజిక వర్గీయులతో యువనేత సమావేశమవుతారు. కృష్ణంరాజులకండ్రిగలో స్థానికులతో మాటామంతిలో పాల్గొని, తుంబూరులో ఎస్సీ సామాజిక వర్గీయులతో సమావేశం అవనున్నారు. ఐఆర్‌కండ్రిగలో లోకేష్ భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం అనంతరం పలమగలంలో ముస్లిం మైనార్టీలతో ముఖాముఖిలో పాల్గొంటారు. సాయంత్రం పిచ్చాటూరు మండలంలోకి కీలకపూడిలో లోకేష్ ప్రసంగించనున్నారు. లోకేష్‌ను కలిసేందుకు వివిధ సామాజికవర్గ ప్రజలు, స్థానిక ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు.

గాలేరు-నగరి ప్రాజెక్టును పూర్తిచేస్తాం...

నగరి నియోజకవర్గంలో సమస్యలన్నీ పరిష్కారమై అభివృద్ధి చెందాలంటే యువకుడైన గాలి భానుప్రకాష్‌ (Gali Bhanuprakash)ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. చినరాజకుప్పం సమీపంలో సోమవారం నాడు జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ... రెండు సార్లు మనం గెలవలేకపోయామని, ఈసారి చరిత్ర తిరగరాయాలన్నారు. కలిసికట్టుగా కష్టపడి భానుప్రకాష్‌ను మంచి మెజారిటీతో గెలిపించాలన్నారు. నియోజకవర్గంలో చేనేత కార్మికులు అధికంగా ఉన్నారని, తమిళనాడు రాష్ట్రం వలే 500 యూనిట్ల కరెంటును ఉచితంగా ఇవ్వకపోవడంతో కుదేలవుతున్నారని వాపోయారు. టీడీపీ అధికారంలోకి వస్తే 500 యూనిట్లను ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. అగ్నికుల క్షత్రియులకు సర్టిఫికెట్లను ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఏపీఐఐసీ ద్వారా ఇండస్ర్టియల్‌ పార్కును ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పిన జగన్‌ మాట తప్పారని టీడీపీ అధికారంలోకి వస్తే ఇండస్ర్టియల్‌ పార్కు ఏర్పాటు చేయిస్తానన్నారు. గాలేరు-నగరి ప్రాజెక్టును పూర్తిచేస్తామన్నారు. చెరకు రైతులకు బకాయిలు ఇప్పించడంలో అధికార పార్టీ చేతులెత్తేసిందన్నారు.

జనగళంగా మారిన యువగళం

సభ తరువాత సాగిన లోకేష్ పాదయాత్రలో దారిపొడవునా జనమే. సందుల్లో నుంచి, గొందుల్లో నుంచి బిలబిలమంటూ వస్తున్న జనం. మేడపైనా, గోడపైనా ఎటుచూసినా జనమే. ఆ జనం మధ్యలో చిరుమందహాసంతో చేయి ఊపి అభివాదం చేస్తూ, పిడికిలి బిగించి సంఘటితం చేస్తూ ముందుకు కదులుతున్న లోకేష్‌కు గజమాలలతో సోమవారం నాడు నగరి నియోజకవర్గం ఘన స్వాగతం పలికింది. ముచ్చటపడి సెల్ఫీలు తీసుకునే అభిమానులతో, ఆత్మీయంగా పలకరించేందుకు ముందుకొచ్చినవారితో చేతిలో చెయ్యేసి లోకేష్ మాటలు కలిపారు. బాధలు చెప్పుకునేందుకు వచ్చిన వారితో భుజంతట్టి భరోసా ఇచ్చారు. పుత్తూరులోని వెంకట పెరుమాళ్‌ ఇంజనీరింగ్‌ కళాశాల నుంచి సోమవారం సాయంత్రం 5.15 గంటలకు పాదయాత్ర ప్రారంభించిన యువనేతకు అడుగడుగునా జనం ఘన స్వాగతం పలికారు. సెల్ఫీలు తీసుకోవడానికి యువకులు ముందుకొచ్చారు. ఓ దివ్యాంగుడిని లోకేష్ పరామర్శించి టీడీపీ అధికారంలోకి వస్తే అన్ని సౌకర్యాలూ కల్పిస్తామని హామీ ఇచ్చారు. హిమజ కళాశాల వద్ద అరటి కాయలతో గజమాల వేశారు. పుత్తూరు పట్టణంలో అంబేడ్కర్‌ విగ్రహానికి లోకేష్ పూలమాల వేసి అభివాదం చేశారు. పుత్తూరు రహదారి గుండా నారాయణవనం మండలం వెత్తలతడుకు వద్ద ఏర్పాటుచేసిన విడిది కేంద్రానికి లోకేష్ సోమవారం రాత్రి 10.18గంటలకు చేరుకున్నారు. దీంతో నగరి నియోజకవర్గంలో ముగిసిన పాదయాత్ర సత్యవేడు నియోజకవర్గంలోకి మంగళవారం నాడు ప్రవేశించింది.

Updated Date - 2023-02-14T12:26:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising