ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YuvaGalam: 20వ రోజు పాదయాత్ర... దళితులతో లోకేష్ ముఖాముఖి

ABN, First Publish Date - 2023-02-15T11:04:22+05:30

చిత్తూరు జిల్లాలో టీడీపీ యువనేత లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. 20వ రోజు పాదయాత్రను కీలపూడి విడిది కేంద్రం నుంచి లోకేష్ ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: చిత్తూరు జిల్లాలో టీడీపీ యువనేత లోకేష్ పాదయాత్ర (NaraLokesh YuvaGalam Padayatra) కొనసాగుతోంది. 20వ రోజు పాదయాత్రను కీలపూడి విడిది కేంద్రం నుంచి లోకేష్ ప్రారంభించారు. వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడుతూ లోకేష్ తన పాదయాత్రలో ముందుకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఎస్సీ సామాజికవర్గం యువతతో లోకేష్ (LokeshYuvaGalam) సమావేశమయ్యారు. వారు తమ సమస్యలను యువనేతకు విన్నవించుకున్నారు. చీర, గాజులు ఇచ్చేందుకు వెళ్లిన దళిత మహిళలను దారుణంగా కొట్టారని, కేసులు పెట్టి జైల్లో పెట్టారని లోకేష్ మండిపడ్డారు. రాజధాని (AP Capital) విషయంలో జగన్ (AP CM YS Jaganmohan Reddy) మళ్ళీ మోసం మొదలుపెట్టారన్నారు. కర్నూలు (Kurnool), అమరావతి (Amaravati)లకు మోసం చేసినట్టే, విశాఖ (Visakhapatnam) కు మోసం చేస్తారని అన్నారు. జగన్ (AP CM) దళితుల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. దళితులకు ఇంటి పట్టాలు ఇస్తున్నట్టు చెప్పి తమిళనాడు (Tamilnadu) వారికి ఇస్తున్నారంటూ లోకేష్‌కు దళితులు ఫిర్యాదు చేశారు.

మెరుగైన టెక్నాలజీతో తమ ప్రభుత్వమే ఇల్లుకట్టిస్తుందని హామీ ఇచ్చారు. ఇంటికి ఒక పింఛన్ విధానం పేరుతో కుటుంబాలను విడగొడుతున్నారని... తాము కుటుంబాలు విడగొట్టకుండా పింఛన్లు అందిస్తామని తెలిపారు. జగన్ తెల్ల రేషన్ కార్డులు తీసేయాలి, ఎలా పింఛన్లు కట్ చేయాలి, పింఛన్ తగ్గించాలి అని ప్లాన్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కట్టింగ్‌ల ముఖ్యమంత్రి అని వ్యాఖ్యలు చేశారు. రాజారెడ్డి రాజ్యగం అమలుచేసి అంబేద్కర్ రాజ్యగాన్ని అవమనిస్తున్నారన్నారు. మళ్ళీ అంబేద్కర్ రాజ్యాంగం అమలు అయ్యేందుకు ఏం చేయాలో చేసి బుద్ధి వచ్చేలా చేస్తామని హెచ్చరించారు. జగన్ దళిత ద్రోహి అని అన్నారు. విదేశీ విద్య పునరుద్దరిస్తామని... నియోజకవర్గంలో ఒక అంబేద్కర్ భవనం ఏర్పాటు చేస్తామని యువనేత (LokeshYuvaGalam Padayatra)హామీ ఇచ్చారు.

అంతుకుముందు... సత్యవేడు నియోజకవర్గం కీలపూడి విడిది కేంద్రం క్యాంప్ సైట్ వద్ద సెల్ఫీ విత్ లోకేష్ (Selfie With Lokesh) కార్యక్రమంలో యువనేత (Nara Lokesh) పాల్గొన్నారు. ప్రతీ రోజు సుమారుగా 1000 మందికి పైగా క్యాంప్ సైట్ వద్ద లోకేష్ సెల్ఫీలు ఇస్తున్నారు. ప్రతిరోజు తనని కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తల్ని కలిసి సెల్ఫీలు దిగుతున్నారు. యువనేత ఆప్యాయంగా పలకరించి సెల్ఫీ ఇవ్వడంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-02-15T11:04:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising