ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TDP MLCs: ‘వాళ్లకు వర్తించని నిబంధనలు యువగళానికి ఎందుకు?’

ABN, First Publish Date - 2023-02-08T14:17:54+05:30

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పోలీసుల నిబంధనలపై ఆ పార్టీ ఎమ్మెల్సీలు దీపక్ రెడ్డి, దొరబాబుల ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర (NaraLokesh YuvaGalam Padayatra)లో పోలీసుల నిబంధనలపై ఆ పార్టీ ఎమ్మెల్సీలు దీపక్ రెడ్డి, దొరబాబుల (TDP MLCs Deepak Reddy, Dorababula) ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... లోకేష్ పాదయాత్ర (Lokesh Padayatra)ను వైసీపీ ప్రభుత్వం (YCP Government) అడుగడుగునా అడ్డుకుంటోందన్నారు. పాదయాత్ర (YuvaGalam Padayatra)ను అడ్డుకోవడం లేదంటూ వైసీపీ పార్టీ (YCP Party)లో ఉండే నాయకులు చిలక పలుకులు పలుకుతున్నారని విమర్శించారు. వైసీపీ మీడియా (Media) ముందు ప్రదర్శిస్తున్న తీరుకు క్షేత్రస్థాయిలో వ్యహరిస్తున్న తీరుకు చాలా భిన్నంగా కనిపిస్తోందన్నారు. పాదయాత్రలో బహిరంగ సభల నిర్వహణకై... పోలీసు అనుమతుల కోసం చేయని ప్రయత్నాలు అంటూ లేదని ఎమ్మెల్సీలు (TDP MLCs) తెలిపారు.

గంటకో మాట పూట కో తీరుతో పోలీసులు... అనుమతులపై ఆంక్షలు పెట్టి నిరాకరిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ముందు పోలీసులు దొంగ నాటకాలు వేస్తున్నారని విరుచుకుపడ్డారు. వైసీపీకి రాజారెడ్డి రాజ్యాంగం..? టీడీపీకి అంబెడ్కర్ రాజ్యాంగమా అంటూ ప్రశ్నించారు. నెల్లూరులో వైసీపీ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి (YCP Leader Adala Prabhakar Reddy)కి ఓ రూలు... టీడీపీకి మరో రూలా అంటూ విరుచుకుపడ్డారు. ప్రభాకర్ రెడ్డి ర్యాలీకి మైకులతో ఎలా అనుమతులు ఇచ్చారని నిలదీశారు. వైసీపీకి వర్తించని నిబంధనలు ‘‘యువగళాని’’కి ఎందుకని అన్నారు. టీడీపీ సభలకు ముందస్తు అనుమతి కోరినా పోలీసులు స్పందించడం లేదన్నారు. యువగళంతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. రోజుకో విధంగా పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. బ్రిటీషు పాలకులకంటే దారుణంగా వైసీపీ వ్యవహరిస్తోందని అన్నారు. హక్కుల్ని కాపాడుకునేందుకు యువత ముందుకు రావాలని టీడీపీ ఎమ్మెల్సీలు దీపక్ రెడ్డి, దొరబాబుల పిలుపునిచ్చారు.

Updated Date - 2023-02-08T14:17:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising