Breaking : కర్నూలు జిల్లాలో భూకంపం.. ఉలిక్కిపడి పరుగులు తీసిన జనం..

ABN , First Publish Date - 2023-03-06T19:04:13+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో (Kurnool) భూమి కంపించింది. జిల్లాలోని తుగ్గలి మండలం రాతనలో ఒక్కసారిగా భూ ప్రకంపనలు (Earthquake) రావడంతో ఉలిక్కిపడిన జనం ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు.

Breaking : కర్నూలు జిల్లాలో భూకంపం.. ఉలిక్కిపడి పరుగులు తీసిన జనం..

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో (Kurnool) భూమి కంపించింది. జిల్లాలోని తుగ్గలి మండలం రాతనలో ఒక్కసారిగా భూ ప్రకంపనలు (Earthquake) రావడంతో ఉలిక్కిపడిన జనం ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. భూకంపం థాటికి గ్రామంలోని పలు ఇళ్లకు బీటలు వారగా.. పలుచోట్ల సిమెంట్ రోడ్లు నెర్రలిచ్చాయి. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి (YSRCP MLA Sridevi), ఉన్నతాధికారులు రాతన ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే రిక్టర్ స్కేలుపై ఎంత నమోయ్యింది..? అనే విషయాలు ఇంతవరకూ తెలియరాలేదు. ఏయే ప్రాంతాల్లో ఇళ్లు పగుళ్లు వచ్చాయి..? ఎంతమేరకు నష్టం వాటిల్లిందనే దానిపై స్థానికులను అడిగి అధికారులు ఆరాతీస్తున్నారు. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్టు సమాచారం లేదు.

ఫిబ్రవరిలో ఏపీలోని పలు జిల్లాల్లో స్వల్ప భూకంపం వచ్చింది. ఎన్టీఆర్, పల్నాడు (Ntr, Palnadu Districts) జిల్లాలో భూప్రకంపనలు రావడంతో ఆ జిల్లా వాసులు భయంతో వణికిపోయారు. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ, కంచికర్ల, చందర్లపాడు, వీరులపాడు మండలాల్లో భూకంపం సంభవించింది. మరోవైపు.. పల్నాడు జిల్లాలోని అచ్చంపేట మండలం మాదిపాడు, చల్లగరిగ, గింజపల్లి గ్రామాల్లో స్వల్పంగా భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు భయంతో ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

కాగా.. టర్కీలో భూకంపం వచ్చిన తర్వాత ఇండియాలోనూ పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఆదివారం నాడు జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.9గా నమోదైంది. ఉదయం 6.57 గంటలకు భూకంపం వచ్చిట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) తెలిపింది. శ్రీనగర్‌కు 38 కిలోమీటర్ల దూరంలో భూమి ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు పేర్కొంది. ఇవాళ ఉత్తరాఖండ్‌లోనూ భూకంపం వచ్చింది.

Updated Date - 2023-03-06T19:04:13+05:30 IST