CM Jagan: చంపేది ఆయనే.. మానవతావాదిగా డ్రామాలు ఆడేది ఆయనే
ABN, First Publish Date - 2023-01-03T14:46:21+05:30
టీడీపీ అధినేత చంద్రబాబుపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తూర్పుగోదావరి: టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu)పై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (AP CM Jagan Mohan Reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజమండ్రిలో పర్యటిస్తున్న సీఎం... అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ... రాజకీయ వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందన్నారు. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని అన్నారు. చంద్రబాబుది మొసలి కన్నీరని వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. ఎన్నికలప్పుడు ఎన్టీఆర్ ఫొటోకు దండేస్తారని దుయ్యబట్టారు. ఫొటో షూట్ డ్రామాలు చేయడం చంద్రబాబు నైజమన్నారు. గతంలో పుష్కరాలలో 29 మందిని చంపేశారని అన్నారు. డ్రోన్ షాట్స్ కోసం కందుకూరులో 8 మందిని చంపారని.. కొత్త సంవత్సరం రోజు మరో ముగ్గురిని బలి తీసుకున్నారని మండిపడ్డారు. చంపేది ఆయనే.. మానవతావాదిగా డ్రామాలు ఆడేది ఆయనే అంటూ వ్యాఖ్యలు చేశారు. దత్తపుత్రుడికి ఇవన్నీ తెలిసినా ప్రశ్నించరని జగన్ విమర్శలు గుప్పించారు.
కొత్తగా 2,31,989 మందికి పెన్షన్లు మంజూరు...
కాగా... రాజమండ్రి పర్యటనలో భాగంగా పెన్షన్ లబ్ధిదారులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. రూ.1,765 కోట్ల నిధులను విడుదల చేస్తూ... కొత్తగా 2,31,989 మందికి పెన్షన్లు మంజూరు చేశారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగిస్తూ... పార్టీలకు అతీతంగా ఇళ్ల దగ్గరకు వెళ్లి పెన్షన్లు ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో మాదిరిగా పెన్షన్లలో కోతలు లేవన్నారు. అర్హత ఉంటే చాలు ప్రతినెల ఇంటికి వెళ్లి పెన్షన్లు ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వం కేవలం రూ.వెయ్యి మాత్రమే పెన్షన్ ఇచ్చేదని గుర్తుచేశారు. పెన్షన్‌ను రూ.2,500 నుంచి రూ.2,750కు పెంచామని తెలిపారరు. ఈ స్థాయిలో పెన్షన్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనది అని జగన్ చెప్పుకొచ్చారు.
Updated Date - 2023-01-03T14:46:22+05:30 IST