‘హోప్’ లేనట్లే!
ABN , First Publish Date - 2023-11-05T00:27:30+05:30 IST
కాకినాడనుంచి హోప్ ఐలాండ్‌కు సముద్రంలో సరదాగా షికారుకు వెళ్లాలనుకునే పర్యాటకులను రాష్ట్రప్రభుత్వం ఉసూరుమనిపిస్తోంది. నాలుగేళ్లవుతున్నా కనీసం ఒక్క బోటును కూడా నడపలేక చేతులెత్తేస్తోం ది. బోటు సర్వీసు పునరుద్ధరిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఎందరో పర్యాటక ప్రియు లు వచ్చి వాలడానికి సిద్ధంగా ఉన్నా కనీసం దృష్టిసారించడంలేదు.

-పర్యాటకులకు కాకినాడ హోప్ ఐలాండ్ టూర్ ఇక కలేనా
-నాలుగేళ్లు దాటినా ఇంకా పునరుద్ధరణ జరగని బోటు షికారు
-అప్పట్లో కచ్చులూరు ప్రమాదం తర్వాత పర్యాటక బోట్లకు అనుమతులు రద్దు
-గతేడాది 50 సీట్లతో పర్యాటక బోటు నడపడానికి పర్యాటకశాఖ టెండర్లు జారీ
-ఒకే ఒక కాంట్రాక్టర్ ముందుకు రావడంతో అనుమతులు ఇచ్చిన అధికారులు
-తీరా నెలవారీ ఆదాయంలో పదిశాతం వాటా షరతు విధించడంతో పరార్
-పర్యాటకుల కోసం సొంతంగానైనా బోటు నడపడానికి ముందుకురాని ప్రభుత్వం
(కాకినాడ, ఆంధ్రజ్యోతి)
కాకినాడనుంచి హోప్ ఐలాండ్‌కు సముద్రంలో సరదాగా షికారుకు వెళ్లాలనుకునే పర్యాటకులను రాష్ట్రప్రభుత్వం ఉసూరుమనిపిస్తోంది. నాలుగేళ్లవుతున్నా కనీసం ఒక్క బోటును కూడా నడపలేక చేతులెత్తేస్తోం ది. బోటు సర్వీసు పునరుద్ధరిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఎందరో పర్యాటక ప్రియు లు వచ్చి వాలడానికి సిద్ధంగా ఉన్నా కనీసం దృష్టిసారించడంలేదు. జగన్ సర్కారు తీరుతో హోప్ ఐలాండ్ పర్యాటకం పూర్తిగా పడకేసింది. కోట్లు వెచ్చించి కేంద్ర ప్రభుత్వ నిధులతో ఐలాండ్‌వద్ద నిర్మించిన జెట్టీలు, ఇతర నిర్మాణాలు ఎందుకూ కొరగాకుండా పోతున్నాయి. వాస్తవానికి హోప్ ఐలాండ్‌కు బోటు నడపడానికి ప్రైవేటు పార్టీలను ఆహ్వానిస్తూ పర్యాటక శాఖ గతేడాది టెండర్లు పిలిచింది. రూ.కోటితో బోటు కొని నడపడానికి ఒకేఒక కంపెనీ ముందుకు వచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే జగన్ ప్ర భుత్వంపై నమ్మకం కోల్పోయిన కాంట్రాక్టర్లు నాలుగున్నరేళ్లలో ఏ టెండర్ కు ముందుకు రావడం లేదు. కానీ అతికష్టంపై ఒకే ఒక కం పెనీ ముం దుకు వస్తే హోప్‌ఐలాండ్‌కు బోటు నడపడం ద్వారా వచ్చే నెలవారీ లా భంలో ప్రభుత్వం పదిశాతం వాటా అడిగింది. దీంతో సదరు కాంట్రాక్టరు వెళ్లిపోయాడు. దీంతో బోటు షికారు ఇప్పట్లో అసాధ్యంగా మారింది.
పర్యాటకానికి ఇదా ప్రోత్సాహం..
కాకినాడ అంటే పర్యాటకులకు ఠక్కున గుర్తొచ్చేది హోప్ ఐలాండ్. సముద్రంలో సహజసిద్ధంగా ఏర్పడిన ఈ ద్వీపం రక్షణ కవచంలా నగరా న్ని కాపాడుతోంది. పర్యాటకులకు హోప్ ఐలాండ్ పంచే ఆనందం అంతా ఇంతాకాదు. ఒకరకంగా చెప్పాలంటే దీన్ని చూడ్డానికి రెండు కళ్లు చాల వంటే అతిశయోక్తికాదు. అందుకే ఎక్కడెక్కడినుంచో పర్యాటకులు పరుగు లు తీసుకుని కాకినాడకు వాలిపోతారు. చుట్టూ నీలి సముద్రం.. నీటిపై తేలియాడుతూ కట్టిపడేసే మడ అడవులు ప్రకృతి ప్రియులకు మాటల్లో వర్ణించలేని అనుభూతులు అందిస్తాయి. 2019 సెప్టెంబర్‌లో గోదావరిలో కచ్చులూరు వద్ద బోటు ప్రమాదంతో రాష్ట్రప్రభుత్వం అన్ని రకాల బోటు షికార్లను నిలిపివేసింది. దీంతో హోప్ ఐలాండ్‌కు రోజూ రెండుసార్లు వెళ్లి వచ్చే బోటు సర్వీసులను సైతం నిలిచిపోయాయి. అప్పటినుంచి ఇప్పటి వరకు నాలుగేళ్ల నుంచీ హోప్‌ఐలాండ్‌కు వెళ్లడానికి బోటు సర్వీసే లేదు. దీంతో పర్యాటకులు ఈసురోమంటున్నారు. ఎక్కడెక్కడినుంచో కాకినాడకు వచ్చినవాళ్లు హోప్ ఐలాండ్‌కు వెళ్లడాని కి వీల్లేదని తెలిసి నిరాశకు గురవుతున్నా రు. అసలు బోటు సర్వీసు ఎప్పుడు మొ దలవుతుందని ప్రశ్నిస్తున్నారు. అయితే గతేడాది తిరిగి హోప్‌ఐలాండ్‌కు బోటు షికారు ప్రారంభించడానికి రాష్ట్ర పర్యా టక అభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ)కొంత ప్రయత్నించింది. కచ్చులూరు ప్రమాదానికి ముందు కాకినాడనుంచి హోప్‌ఐలాండ్‌కు నడిపిన పాత బోటును తిరిగి ప్రారంభించడానికి సిద్ధ పడింది. దీనికి ఫిట్‌నెస్ లేకపోవడంతో బోటుకు కాకినాడ పోర్టు అధికా రులు లెసెన్సు తిరస్కరించారు. ఫలితంగా ఏపీటీడీసీ ప్రయ త్నాలు బెడి సికొట్టాయి. పోనీ కొత్త బోటు కొందామంటే రూ.కోటి వరకు ఖర్చవుతుంది. కానీ జగన్ సర్కారు పర్యాటకశాఖను పట్టించుకోవడం మానేయడంతో అధికారులు నిస్సహాయులుగా మారారు.
పైసా పెట్టకుండానే పదిశాతం కావాలంట..
సొంతబోటుకు అతీగతీ లేకపోవడంతో గతేడాది అక్టోబరులో ఏపీ టీడీసీ ప్రైవేటు పార్టీల ద్వారా హోప్‌ఐలాండ్‌కు బోటు నడిపించేందుకు ప్రతిపాదించింది. ఇందులోభాగంగా సముద్రంలో సాహస జలక్రీడల పే రుతో టెండర్లు పిలిచింది. కాకినాడనుంచి హోప్ ఐలాండ్‌కు 50సీట్లతో బోటు షికారు ప్రారంభించడానికి ప్రైవేటు ఏజెన్సీలు ముందుకు రావాలని బిడ్లు ఆహ్వానించింది. రూ.50లక్షల ప్రాజెక్టు వ్యయంతో దీన్ని చేపడుతు న్నామని, పనులు దక్కించుకున్న సంస్థ పర్యాటకులతో రాకపోకలు సాగిం చడంతోపాటు ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని టెండ ర్ నిబంధనల్లో ప్రస్తావించింది. కాకినాడ తీరంనుంచి హోప్‌ఐలాండ్ వ రకు విడివిడిగా వ్యక్తులు సరదాగా వెళ్లి రావడానికి వీలుగా హౌస్‌బోట్, స్పీడ్‌బోట్, జెట్‌స్కీ సర్వీసులు కూడా ప్రారంభించాలని టెండ ర్ నిబంధనల్లో పేర్కొంది. రూ.70లక్షల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టులో భాగంగా బోట్లు సమకూర్చడానికి ప్రైవేటు సం స్థలను ఆహ్వానిస్తున్నట్లు పే ర్కొంది. దీంతో కాకినాడకు చెం దిన ఓ కంపెనీ హోప్‌ఐలాండ్ కు బోటు సర్వీసు నపడానికి ముందుకు వచ్చింది. ఏపీ టీడీ సీతో ఒప్పందం కుదుర్చుకుం ది. దీంతో ఇంకేం సర్వీసులు ప్రారంభం కావడమే తరువా యి అనుకున్న తరుణంలో రా ష్ట్ర ప్రభుత్వం తీరుతో సదరు కాంట్రాక్టర్ పరారయిపోయా డు. బోటుసర్వీసు ద్వారా నెల నెలా వచ్చే ఆదాయంతో పది శాతం ప్రభుత్వానికి రెవెన్యూ షేర్ ఇవ్వాలని నిబంధనలు విఽ దించడంతో సదరు కాంట్రాక్టర్ చెప్పాపెట్టకుండా వెళ్లిపోయా డు. పర్యాటకశాఖ రూపాయి పెట్టుబడి కూడా పెట్టేది లేద ని చెప్పేసింది. దీంతో సదరు కాంట్రాక్టర్ లాభసాటి కాదనే ఉద్దేశంతో ఒప్పందం పక్కన పెట్టేశాడు. దీంతో హోప్‌ఐలాండ్‌కు బోటు షికారు ఇప్పట్లో సాకారం అవ డం అసాధ్యం. సముద్రంలో సాహస జలక్రీడల పేరుతో ఏపీటీడీసీ నాలు గేళ్లనుంచీ టెండర్లు పిలుస్తూనేఉంది. కానీ ప్రైవేటు సంస్థలు ఆసక్తి చూప ట్లేదు. ఈ నేపథ్యంలో వచ్చిన ఒక్కగానొక్క కాంట్రాక్టర్‌ను సైతం భయపె ట్టడంతో సమస్య మళ్లీ మొదటకు వచ్చింది. అసలు సర్వీసులు ప్రారంభిం చి లాభం వస్తుందో లేదో చూడకుండానే నెలనెలా ఠంచనుగా పదిశాతం వాటా అడగడంతో సదరు కాంట్రాక్టు కంపెనీ పారిపోయింది. స్వదేశీ ద ర్శన్ పథకం కింద కోస్టల్ సర్క్యూట్ పేరుతో హోప్‌ఐలాండ్ అభివృద్ధికి కేంద్ర పర్యాటకశాఖ 2014లో రూ.64కోట్లు మంజురుచేసింది. ఇందులో కొన్ని నిధులతో పాత్‌వే, జెట్టీ, సేదతీరేందుకు కొన్ని నిర్మాణాలు చేపట్టారు. తీరా బోటు షికారు లేకపోవడంతో అవన్నీ నిరుపయోగంగా మారాయి.