జనసేనలో పలువురి చేరిక

ABN , First Publish Date - 2023-03-06T00:21:35+05:30 IST

గొల్లప్రోలు రూరల్‌, మార్చి 5: గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ జ్యోతుల శ్రీనివాస్‌ సహా పలువురు జనసేన పార్టీలో చేరారు. పిఠాపురం నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి మాకినీడి శేషుకుమారి ఆధ్వర్యంలో శ్రీనివాస్‌ తదితరులు ఆదివారం కడియం లో జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెం

జనసేనలో పలువురి చేరిక
పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ సమక్షంలో చేరిన మాజీ ఎంపీటీసీ జ్యోతుల శ్రీనివాస్‌

గొల్లప్రోలు రూరల్‌, మార్చి 5: గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ జ్యోతుల శ్రీనివాస్‌ సహా పలువురు జనసేన పార్టీలో చేరారు. పిఠాపురం నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి మాకినీడి శేషుకుమారి ఆధ్వర్యంలో శ్రీనివాస్‌ తదితరులు ఆదివారం కడియం లో జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ సమక్షంలో పార్టీలో చేరగా వారందరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీనివా్‌సతో పాటు మేడిబోయిన సత్యనారాయణ, జ్యోతుల సీతారాంబాబు, దేశలంక భాస్కరరావు, శాఖా నాగేశ్వరరావు, రావుల తాతారావు, జ్యోతుల గోపి తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. కాగా జ్యోతుల శ్రీనివాస్‌ ఇటీవలే దుర్గాడ-3 ఎంపీటీసీ పదవికి, వైసీపీకి రాజీనామా చేశారు.

పిఠాపురం: నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు జనసేనలో చేరారు. నియోజకవర్గ నాయకుడు డాక్టర్‌ పిల్లా శ్రీధర్‌ ఆధ్వర్యంలో పీఏసీ సభ్యుడు పంతం నానాజీ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గే్‌షల సమక్షంలో వీరంతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ వీరందరికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో గోకివాడ మాజీ సర్పంచ్‌ గరగ సత్యానందరావు, బీజేపీ కొత్తపల్లి మండలాధ్యక్షుడు జీలకర్ర సత్తిబాబు, కందరాడ మాజీ సర్పంచ్‌, ఎంపీటీసీలు బొంతు లచ్చారావు, కుసుమ సుబ్బారావు, లారీ యూనియన్‌ అధ్యక్షుడు కందా చక్రబాబు, బి.కొత్తూరు విద్యాకమిటీ మాజీచైర్మన్‌ దుడ్డు రాంబాబు తదితరులున్నారు.

Updated Date - 2023-03-06T00:22:01+05:30 IST